ఎట్టకేలకు పాన్ ఇండియాపై కన్నేసిన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు సూపర్ స్టార్.కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

మహేష్ వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లు కొడుతున్నా, ఆయన ఫ్యాన్స్ మాత్రం ఓ విషయంలో నిరాశకు గురవుతున్నారు.మహేష్ బాబు లాంటి క్రేజీ స్టార్ ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా చిత్రం కూడా చేయకపోవడమే దీనికి కారణం.

గతంలో మహేష్ బాబు ‘స్పైడర్’ అనే సినిమా చేసినా, అది కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే తెరకెక్కింది.ఇక రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కాదని తేలిపోయింది.

Advertisement

అయితే మహేష్ ఫ్యాన్స్‌కు త్రివిక్రమ్ ఆ కోరికను తీర్చబోతున్నట్లు తెలుస్తోంది.మహేష్ కోసం యూనివర్సల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు.

ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా ఆడియెన్స్‌ను మెప్పించే విధంగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎవరి ఊహలకు అందని విధంగా ఉంటుందని, ఈ సినిమాతో మహేష్ స్థాయి అంతర్జాతీయంగా పెరిగిపోతుందని చిత్ర వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి నిజంగానే మహేష్ కోసం త్రివిక్రమ్ పాన్ ఇండియా సబ్జెక్టు సినిమాను రెడీ చేస్తున్నాడా అనేది చూడాలి.ఇక సర్కారు వారి పాట చిత్రం ఆర్థిక నేరాల చుట్టూ తిరుగుతూ ఉంటుందని, ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సౌత్ సినిమాలు.. రాధేశ్యామ్ ఏ ప్లేస్లో ఉందంటే?
Advertisement

తాజా వార్తలు