వామ్మో నీకు ఓ దండం.. మహేష్‌ బాబు జోలికి రావద్దు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు( Mahesh Babu ) తో తాను ఒక సినిమా ను రూపొందించి సక్సెస్ ను కొట్టాలని కోరుకుంటున్నట్లుగా దర్శకుడు కమ్‌ నటుడు అయిన ఎస్ జే సూర్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు.

ఆయన నటించిన మార్క్ ఆంటోనీ ( Mark Antony )ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో తెలుగు లో కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.అక్కడ ఇక్కడ విశాల్ మరియు ఎస్ జే సూర్య లకు ఉన్న క్రేజ్ నేపథ్యం లో మంచి బిజినెస్ చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా నటుడు కమ్‌ దర్శకుడు అయిన ఎస్ జే సూర్య( S J Surya ) మాట్లాడుతూ తాను మహేష్ బాబు కి ఒక సినిమా చేసి పెట్టాల్సి ఉంది.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ఉండాలని తాను ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

తప్పకుండా తనకు మహేష్ బాబు డేట్లు ఇస్తాడని.తప్పకుండా నేను ఆ సినిమాను చేస్తాను అన్నట్లుగా పేర్కొన్నాడు.

Advertisement

అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం బాబోయ్‌ మా మహేష్ బాబు జోలికి రావద్దు ప్లీజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో మహేష్ బాబు ఫ్యాన్స్‌ తాజాగా ఎస్ జే సూర్య వ్యాఖ్య లను షేర్‌ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.గతం లో మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వం లో వచ్చిన స్పైడర్ సినిమా ( Spider movie )లో ఎస్ జే సూర్య నటించాడు.

ఆ సినిమా డిజాస్టర్‌ అయింది.అయితే అందులో సూర్య పాత్ర విషయం లో మహేష్ బాబు అభిమానులు ఇప్పటికి కూడా కోపంగానే ఉన్నారు.అలాంటి పాత్రను తెలుగు సినిమా ల్లో ఎలా చూపించారు అంటూ మురుగదాస్ ను మరియు మహేష్ బాబు ను చాలా మంది విమర్శించడం జరిగింది.

కనుక ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఆయన సినిమా వద్దని చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు
Advertisement

తాజా వార్తలు