గౌతమ్‌, సితార సెంటిమెంట్‌ మహేష్‌ కు వర్కౌట్‌ అవ్వలేదా?

మహేష్‌ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.

కాని కాస్త అంచనాలు తప్పాయి.కాని సినిమా మరీ డిజాస్టర్ అయితే అస్సలు కాదు.

Mahesh Babu Bad Sentiment With His Kids , Goutham , Mahesh Babu , Sarkaru Vaar

ఫస్ట్‌ హాఫ్ లో మంచి ఎంటర్‌ టైన్మెంట్‌ ను దర్శకుడు పరశురామ్‌ అందించాడు.మహేష్ బాబు మాస్ ఎలిమెంట్స్ మరియు కీర్తి సురేష్ విభిన్నమైన లుక్ మరియు పాత్ర తో ఆకట్టుకున్నారు.

సినిమా ఫస్ట్‌ హాఫ్ మరియు ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కు అంతా కూడా ఫిదా అవుతారు అనడం లో సందేహం లేదు.కాని సెకండ్‌ విషయంలో కాస్త నిరాశ తప్పదు.

Advertisement

పదే పదే మెసేజ్ లు ఇవ్వడం.కామెడీ పేరుతో కాస్త అతి చేయడం జరిగింది.

కనుక ఓవరాల్‌ గా సెకండ్‌ హాఫ్ కాస్త నిరాశ పర్చింది.అయితే సినిమా ఓవరాల్‌ టాక్ మాత్రం యావరేజ్‌.

మహేష్ బాబు సినిమా యావరేజ్ అంటే మామూలు విషయం కాదు.ఖచ్చితంగా అభిమానులకు సినిమా చేరితే వంద కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అనడంలో సందేహం లేదు.

అంతటి గుర్తింపు దక్కించుకున్న మహేష్‌ బాబు సినిమా విషయంలో కొందరు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు.ఒక హీరో పై కోపంతో మరో హీరో అభిమానులు సినిమాలను సోషల్‌ మీడియాలో బ్యాడ్‌ కామెంట్స్ చేయడం.

న్యూస్ రౌండప్ టాప్ 20

తప్పుడు కామెంట్స్ తో సినిమా ను తక్కువ చేయడం చేస్తున్నారు.దాంతో సర్కారు వారి పాట సినిమాకు డ్యామేజీ జరిగింది.

Advertisement

దీనికి తోడు కొందరు యాంటీ మహేష్‌ బాబు ఫ్యాన్స్ కొత్త వాదన తెర మీదకు తీసుకు వచ్చారు.గతంలో గౌతమ్‌ నటించిన 1 నేనింతే సినిమా ప్లాప్‌ అయ్యింది.

ఇప్పుడు సితార పాట లిరికల్‌ వీడియోలో కనిపించడం తో ప్లాప్‌ అయ్యింది.మహేష్‌ బాబుకు పిల్లల సెంటిమెంట్‌ వర్కౌట్‌ కాలేదు అంటున్నారు.

అసలు సితార ఈ సినిమాలో నటించలేదు.అయినా కూడా ఆమెను ఇన్వాల్వ్‌ చేసి విమర్శలు చేయడం అవివేకం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు