మహేష్‌, త్రివిక్రమ్‌ మూవీ మొదలయ్యింది.. ఏం జరుగుతుందో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.త్రివిక్రమ్‌ ల కాంబోలో మూవీ ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది.

సినిమా పూజా కార్యక్రమాలు కాని షూటింగ్‌ కార్యక్రమాలు కాని ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.కాని సినిమాకు సంబంధించిన వర్క్‌ మాత్రం జరుగుతూనే ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Hero Mahesh Babu And Trivikram Movie Pre Production Update , Mahesh Babu, Trivik

విశ్వసనీయంగా మాకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌ శివారులో మహేష్‌ బాబు.త్రివిక్రమ్‌ల మూవీ కోసం ఒక భారీ సెట్టింగ్‌ ను నిర్మిస్తున్నారు.

అందులో ఒక ఇంటి సెట్టింగ్‌ తో పాటు ఒక వీధి సెట్టింగ్‌ ను కూడా వేస్తున్నారట.అందులో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపిక జరుగుతోంది.ఈ సినిమా టైటిల్‌ ను ఈనెల 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ప్రకటించబోతున్నారు.

మహేష్‌ బాబు కు జోడీగా పూజా హెగ్డే ను హీరోయిన్ గా నటింపజేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.త్వరలోనే హీరోయిన్‌ విషయం కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మొత్తానికి మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ పట్టాలెక్కకుండానే సందడి చేస్తోంది.సెట్టింగ్‌ నిర్మాణం నుండి మొదలుకుని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ దాదాపు అన్ని పనులు కూడా చకచక జరుగుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టకుండానే థమన్ మొత్తం పాటలను ట్యూన్‌ చేయబోతున్నాడట.మహేష్‌ బాబుకు థమన్ మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చేందుకు బ్యాక్ టు బ్యాక్‌ సిద్దం అవుతున్నాడు.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

సర్కారు వారి పాట కు మరియు త్రివిక్రమ్‌ తో చేయబోతున్న పాటకు కూడా థమన్‌ సంగీతాన్ని ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. మహేష్‌ బాబు వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారు వారి పాటను సమ్మర్ లో త్రివిక్రమ్‌ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు