త్రివిక్రమ్ కోసం మహేష్ 60 రోజుల డేట్స్..!

సర్కారు వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో ఓ భారీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ లో కె.

రాధాకృష్ణ హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సినిమాలో మహేష్ కి జోడీగా హాట్ బ్యూటీ పూజా హెగ్దేని ఫిక్స్ చేశారు.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం మహేష్ కేవలం 60 రోజుల డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.అంతేకాదు రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నారట.త్రివిక్రం సినిమా కోసం మహేష్ కేవలం రెండు నెలల డేట్స్ కేటాయిస్తున్నారట.

ఇక ఈ మూవీకి రెమ్యునరేషన్ గా 60 కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నారట.అంటే మహేష్ బాబుకి రోజుకి 1 కోటి దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పొచ్చు.

Advertisement

మహేష్ 60 కోట్లు.త్రివిక్రం 15 నుంచి 20 కోట్లు ఇలా డైరక్టర్ హీరో రెమ్యునరేషన్ తోనే 80 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారు.

ఇక అసలు ప్రొడక్షన్ కోసం మరో 40 కోట్లు అంటే మహేష్, త్రివిక్రం కాంబో సినిమాకు 120 నుంచి 150 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నారట.అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రం మెగా ఫోన్ పడుతున్న ఈ సినిమా మరోసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించబోతున్నారు.సినిమా ఫైనల్ వర్షన్ విని మహేష్ సూపర్ ఎక్సయిట్ అయ్యారట.

మహేష్ త్రివిక్రం కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమా వస్తుంది.అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ తో మూడవ సినిమా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మహేష్.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

త్రివిక్రం సినిమాని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి 2023 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.2023 మొదట్లోనే మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళితో స్టార్ట్ చేయనున్నారు. రాజమౌళితో మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Advertisement

ఆ మూవీ మాత్రం 500 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

తాజా వార్తలు