మహా శివరాత్రి రోజు విభూదిని తయారుచేస్తారట... ఎందుకో తెలుసా?

మహాశివుడికి శివరాత్రి అంటే ఎంతో ముఖ్యమైన పండుగ.శివరాత్రి రోజు స్వామివారు విశేష పూజలను అందుకుంటారు.

మహాశివుడు సాకారమైన మూర్తిగా, నిరాకారమైన లింగంగాను పూజలు అందుకుంటాడు.ఆ పరమేశ్వరుడు లింగాకృతి పొందినది ఈ మహా శివరాత్రి రోజు కనుక శివరాత్రి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన శివరాత్రి రోజు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.పెళ్ళికాని యువతీ యువకులకు పెళ్లి ఘడియలు దగ్గరకు వస్తాయి.

తెలిసి తెలియక చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.మహాశివరాత్రి రోజు ప్రాతః కాల సమయంలో నిద్ర లేచి తలంటు స్నానం చేసి పువ్వులు, ఫలాలు, ఆ పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి పూజ చేస్తారు.

Advertisement
Maha Shivratri 2021 Significance Of Vibhuthi Maha Sivaratri, Vibhuthi, Lard Shiv

పూజ సమయంలో శివ పంచాక్షరి, లింగాష్టకం వంటివి జపిస్తారు.అదేవిధంగా శివరాత్రి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ తెల్లవార్లు జాగరణలు చేసి భక్తి గీతాలు ఆలపిస్తారు.

శివరాత్రి పండుగ రోజు ఉపవాసం జాగరణ ఎంతో ముఖ్యమైనవి.

Maha Shivratri 2021 Significance Of Vibhuthi Maha Sivaratri, Vibhuthi, Lard Shiv

పరమేశ్వరుడికి పువ్వులు పండ్లుతో పాటు విభూది అంటే ఎంతో ప్రీతికరం.పురాణాల ప్రకారం పరమేశ్వరుడు సాగర మధనం చేసిన సమయంలో విషం తాగినప్పుడు ఆ మంటను తగ్గించడానికి స్వామివారి గొంతుపై విభూదిని రాయటం వల్ల స్వామివారికి చల్లదనం ఏర్పడిందని చెప్తారు.అందుకే స్వామివారికి విభూది అంటే ఎంతో ఇష్టం.

శివరాత్రి రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూదిని తయారుచేస్తారు.అందుకే శివ భక్తులు ఎంతో పరమ పవిత్రమైన విభూతిని శరీరమంతా దరిస్తారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన శివరాత్రి రోజు ఎలాంటి పరిస్థితులలో తప్పు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు.

Advertisement

తాజా వార్తలు