ఎలాంటి ఒత్తిడినైనా చిత్తు చేసే మ్యాజిక‌ల్ `టీ` .. త‌ప్ప‌కుండా ట్రై చేయండి!

ఒత్తిడి.నేటి ఆధునిక కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా దాదాపు అంద‌రికీ ఇది ఒక కామ‌న్ శ‌త్రువు అయిపోయింది.

అనుకున్న స‌మ‌యానికి చేయాల్సిన ప‌ని పూర్తి కాక‌పోయిందంటే ఒత్తిడి, ప‌రీక్ష‌ల్లో మార్కులు త‌క్కువ వ‌చ్చాయంటే ఒత్తిడి, మ‌న‌కు కావాల్సిన వారు దూర‌మైతే ఒత్తిడి, బ‌రువు పెరిగితే ఒత్తిడి.ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి మ‌న‌షి రోజు ఏదో ఒక కార‌ణం చేత ఒత్తిడికి లోన‌వుతూనే ఉంటాడు.

ఇక కొంద‌రైతే అన‌వ‌స‌ర విష‌యాల గురించి ఆలోచిస్తూ కూడా ఒత్తిడిని పెంచుకుంటారు.కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ.

ఒత్తిడిని చిత్తు చేసే మ్యాజిక‌ల్ టీ ఒక‌టి ఉంది.ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు మిరియాలు, రెండు యాల‌కులు, చిన్న దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, రెండు ల‌వంగాలు వేసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే వ‌న్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడ‌ర్ మ‌రియు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.బాగా మ‌రిగిన త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని.

టీను స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఇక ఈ మ్యాజిక‌ల్ టీలో రుచికి స‌రిప‌డా తేనె మిక్స్ చేసి తాగేయ‌డ‌మే.

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ టీని తీసుకుంటే.చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

పైగా ఈ టీ డైట్‌లో ఉంటే డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.వెయిట్ లాస్ అవుతారు.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

బాడీ డిటాక్స్ అవుతుంది.లివ‌ర్ శుభ్రంగా కూడా మారుతుంది.

Advertisement