కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.. మద్రాస్ హైకోర్టు జడ్జిల కీలక వ్యాఖ్యలు.. !

నేడు రాష్ట్రాలను ఏలుతున్న ప్రభుత్వాలు చిత్తశుద్దితో పని చేస్తున్నాయా అని గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తే ఆ గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్దితులు నెలకొన్నాయట.

ఎందుకంటే ప్రజా సంక్షేమం కంటే పదవుల వ్యామోహంలో నేడు నేతలు మునిగిపోయి ఉన్నారన్నది జగమెరిగిన సత్యం.

ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత గురించి నిపుణులు హెచ్చరిస్తున్న ఈ వైరస్‌ను చాలా తేలికగా తీసుకోవడం వల్ల జరిగిన ప్రాణ నష్టాన్ని పూడ్చడం ఏ నాయకుని వల్ల అవుతుంది.ఇక కరోనాకు వ్యాక్సిన్స్ అని తీసుకువచ్చారు.

వీటితో పాటూగా సమాధానం దొరకని అనుమానాలు కూడా పుట్టాయి.నేడు కరోనా వైద్యం ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోవడంతో సామాన్యుడు బ్రతకడం కష్టంగా మారింది.

ఇలాంటి సమయంలో కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మద్రాస్ హైకోర్టు జడ్జిలు కీలక వ్యాఖ్యలు చేసారు.కాగా నేడు మద్రాస్ హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చిన సందర్భంలో న్యాయమూర్తులు జస్టిస్ తమిళ్ సెల్వి, జస్టిస్ కరుణాకరణ్ ఆనందయ్యకు సెల్యూట్ చేస్తూ ముఖ్యంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు.

Advertisement
కెనడాలోని ఎన్ఆర్ఐలకు లాస్ట్ ఛాన్స్ .. ఈ వీకెండ్‌లో చివరి బ్యాచ్ కాన్సులర్ క్యాంప్‌లు

తాజా వార్తలు