Madhavilatha : తనను అలా అన్నవారికి గట్టి కౌంటర్ వేసిన మాధవిలత.. తను ఆ టైప్ కి చెందినామెను అంటూ?

అందరు మనుషులు ఒకేలా ఉంటారు అనుకోవడం పొరపాటు.ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు.

కొందరు అందరితో కలుస్తారు.మరికొందరు మాత్రం ఒంటరిగా ఉండాలనుకుంటారు.

కొంతమంది అందరి ముందు నటించాలని చూస్తే.మరి కొంతమంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన.ఒంటరిగా ఉన్న అవతలి వ్యక్తులు వారిని బాగా విమర్శిస్తూ ఉంటారు.

Advertisement
Madhavilatha Gave A Strong Counter To Those Who Called Her Like That Saying Tha

నోటికి వచ్చే మాటలతో దూషిస్తూ ఉంటారు.ఇటువంటిదే నటి మాధవి లత( Actress Madhavi Lata )కు ఎదురు కాగా తన స్టైల్ లో సమాధానం ఇచ్చేసింది ఈ బ్యూటీ.

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మాధవి లత.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈమె చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై నటిగా అడుగుపెట్టింది.ఆ తర్వాత తన నటనకు మంచి మార్కులు రావడంతో హీరోయిన్ గా పరిచయం అయింది.

అలా 2008 లో నచ్చావులే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బ్యూటీ.ఇక తన అందం పరంగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

Finance And Health Minister Harish Rao Laid The Foundation Stone For The New OPD Block To Be Built

ఆ తర్వాత స్నేహితుడు సినిమాలో కూడా నటించింది.కానీ ఎందుకో తను ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Advertisement

పైగా తాను కథ ఎంచుకోవడంలో పొరపాటు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.అలా ఎంతో కాలం అవకాశాల కోసం బాగా ఎదురు చూసింది.

కానీ కొత్త హీరోయిన్ లు అడుగుపెట్టడంతో ఈమెకు అవకాశాలు అనేది లేకపోయాయి.పైగా తెలుగు అమ్మాయి కాబట్టి ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశారు.

అయినప్పటికీ కూడా అవకాశాల కోసం బాగా ప్రయత్నిస్తుంది.ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.

రాజకీయపరంగా కూడా యాక్టివ్ గా ఉంది ఈమె.ఇక నిత్యం తన సోషల్ మీడియా వేదికగా ఏదో విషయం తో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటుంది.

పైగా తాను కూడా అవతలి వారి పై బాగా ఫైర్ అవుతుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.

ఇక అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.తను చేసిన డిజైన్స్ గురించి కూడా వీడియోస్ ద్వారా పంపిస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.

అయితే ఈమెను చాలామంది పొగరు అంటూ రకరకాలుగా దూషిస్తూ ఉంటారు.వారిని ఉద్దేశించి తను వీడియోలో కొన్ని విషయాలు పంచుకుంది.

తనను చాలా మంది పొగరు అంటుంటారు అని.కానీ నిజానికి అది పొగరు కాదు.నేను ఇంట్రోవర్ట్ టైప్ కు చెందినామెను అంటూ నేను అందరితో కలవలేను అని తెలిపింది.

ఇక కొత్త వారితో అసలు మాట్లాడలేను అని అన్నది.తన లైఫ్ లో కూడా మంచి రోజులు, చెడు రోజులు, డబ్బు వచ్చే రోజులు, డబ్బులు లేని రోజులు వస్తుంటాయని.

కానీ అన్ని సమయంలో ఒకేలాగా ప్రవర్తిస్తాను అని.అందరిలాగా అందరి కోసం నటించను అని.ఏమున్న ముఖం ముందే చెప్పేస్తాను అని తెలిపింది.ప్రస్తుతం ఆమె షేర్ చేసుకున్న వీడియో బాగా వైరల్ అవ్వగా మీరు కరెక్ట్ చెప్పారు మేడం అంటూ తనకు మద్దతు పలుకుతున్నారు.

తాజా వార్తలు