కారును ఢీ కొట్టి పల్టీ కొట్టిన లారీ... వీడియో వైరల్...!

సాధారణంగా కారును లారీ ఢీ కొడితే కారు పల్టీ కొడుతుంది.కారులో ప్రయాణించే వ్యక్తులే గాయాలపాలవ్వటం లేదా మరణించటం జరుగుతుంది.

కొన్ని సందర్భాల్లో కారు నుజ్జునుజ్జు అయిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.కానీ ఎప్పుడైనా కారును ఢీ కొట్టి లారీ పల్టీ కొట్టడం గురించి విన్నామా.? వినడానికి ఆశ్స్చర్యంగానే ఉన్నా ఈ ఘటన నిజంగా జరిగింది.ఈ ఘటన అక్కడెక్కడో కాదు మన దేశంలోనే జరగడం గమనార్హం.

పూర్తి వివరాలలోకి వెళితే జమ్ము కశ్మీర్ లో ఉల్లి లోడుతో వెళుతున్న ఒక లారీ కారును ఢీ కొట్టింది.ఆ తరువాత కొన్ని సెకన్ల సమయంలోనే లారీ బోల్తా పడటంతో ఆ ప్రాంతమంతా విధ్వంసం చోటు చేసుకుంది.

కారును ఢీ కొట్టిన లారీ బోల్తా పడటంతో సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ గా మారుతోంది.లారీ బోల్తా కొట్టినా లారీ డ్రైవర్ కు ఈ ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదు.

Advertisement

స్థానికులు ఇరుకు వీధిలో వేగంగా లారీ, కారు ప్రయాణించడం వలనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.ఈఘటన లో కారు డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.

ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.అక్కడి స్థానికులు ఈ ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

పోలీసులు ఈ ప్రమాదం గురించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
Advertisement