కాకులు చూడండి.. రివేంజ్ ఎలా ప్లాన్ చేశాయో?

సహజంగా కాకులు( crows ) ఇంటి వద్దకి, చికెన్ షాప్ వద్దకి వస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

కొంతమంది ఆ కాకులను ఏకంగా వారి పితృ దేవతలు అనుకోని ఆహారం కూడా అందిస్తుంటారు.

ఇక మనం ఎక్కువగా కాకులను చికెన్ షాప్ వద్దకు వెళ్లి మాంస ముద్దను ఎత్తుకెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం.ఒక్కోసారి నాన్ వెజ్ షాపుల ముందు గుంపులు గుంపులుగా కాకులు తిరగడం కూడా మనం గమనించవచ్చు.

ఇలాంటి సమయంలో ఆ చికెన్ షాపు యజమానికి బాగా ఆగ్రహాన్ని కూడా గురిచేస్తాయి.అచ్చం అలాంటిదే ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లోని అంబేద్కర్ కోన సీమ జిల్లాలో తాటిపాకలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Advertisement

తాటిపాక డైలీ మార్కెట్లో కొన్ని చికెన్ షాపులు( Chicken shops ) రోజు చికెన్ విక్రయాలు జరుపుతున్నారు.ఈ క్రమంలో ఒక చికెన్ షాపు దగ్గరకు ఒక కాకి ప్రతిరోజు వస్తూ చికెన్ ముక్కలను ఎత్తుకొని అక్కడి నుంచి పారిపోతుంది.ఆ కాకిని యజమాని ఎన్నిసార్లు తరిమి కొట్టినా కూడా ఆ కాకి మళ్ళీ మళ్ళీ షాపు వద్దకే తిరిగి వస్తుంది.

అయితే ఈసారి ఆ యజమాని కాకిని షాపు దగ్గరకు రానిచ్చి చాలా తెలివిగా పట్టుకొని ఒక తాడుతో ఆ కాకిని కట్టేశాడు.దీంతో ఆ కాకి పెద్దగా అరవడం మొదలుపెట్టడంతో వందలాది కాకులు ఒకసారిగా ఆ షాపు వద్దకు వచ్చాయి.

అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఎగురుతూ పెద్దగా అరవడం మొదలుపెట్టాయి.ఇలా చికెన్ షాపు చుట్టూ వందలాది కాకులు అరవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ చాలా చికాకు వచ్చింది.

అప్పటికి కూడా చికెన్ షాప్ యజమాని ఆ కాకిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేది లేదు అంటూ తెలిపాడు.

బుక్ మై షోలో కల్కితో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదుగా!
కొరుకుతూ, కొడుతూ, గొంతు పిసుకుతూ పిల్లోడిని హింసించిన తల్లి.. వీడియో వైరల్..

ఇక అక్కడ చికెన్ దుకాణా యజమానుల అందరూ కూడా విసుకురావడంతో కాకిగోల భరించలేక బంధించిన కాకిని వదిలేయాలని యజమానిని కోరగా చివరికి ఆ యజమాని ఆ కాకిని అక్కడి నుండి వదిలి పెట్టేసాడు.ఇక అక్కడితో మిగతా కాకులు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Advertisement

ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ కాకుల యూనిటీని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

తాజా వార్తలు