జనాభా గణనలో ప్రత్యేక టిక్ బాక్స్: యూకే సిక్కు ఫెడరేషన్‌కు కోర్టు షాక్

2021లో జరగనున్న యూకే జనాభా గణనలో తమకు ప్రత్యేక టిక్ బాక్స్ కావాలంటూ సిక్కు సంఘాలు దాఖలు చేసిన జ్యూడిషీయల్ రివ్యూ పిటిషన్‌ను లండన్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

ఈ పిటిషన్ ‘‘అకాల’’ మైనదని, మరియు పార్లమెంటరీ అధికారాన్ని ఉల్లంఘించడమేనని జస్టిస్ బెవర్లీ లాంగ్ అభిప్రాయపడ్డారు.

నవంబర్‌లో రెండు రోజుల విచారణ తర్వాత న్యాయమూర్తి తన తీర్పును రిజర్వ్ చేశారు.ఇదే సమయంలో యూకేలోని సిక్కు సమాఖ్యతో పాటు కేబినెట్ కార్యాలయం సమర్పించిన పత్రాలను ఆమె పరిగణనలోనికి తీసుకున్నారు.

రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ యూకే సిక్కు ఫెడరేషన్ తరపున న్యాయ సంస్థ లీ డే ప్రాతినిథ్యం వహిస్తోంది.కేబినెట్ కార్యాలయం నేషనల్ స్టాటిస్టిక్స్ 2018 డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన సెన్సస్ శ్వేతపత్రాన్ని కేబినెట్ కార్యాలయం పార్లమెంట్‌ ముందు పెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

హక్కుదారుడి వాదన అకాలమైనందున కోర్టు దానిని ఎట్టిపరిస్ధితుల్లోనూ నిర్ణయించకూడదని, అదే సమయంలో మంత్రివర్గం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కౌన్సిల్‌లో ముసాయిదా ఉత్తర్వులను పార్లమెంట్ ప్రచురించడం గానీ ఆమోదించడం గానీ చేయలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ తాము అనుమతి కోరతామని యూకే సిక్కు ఫెడరేషన్ తెలిపింది.అదే సమయంలో వచ్చే జనాభా లెక్కల్లో ప్రత్యేక సిక్కు జాతి టిక్ బాక్స్ కోసం అవగాహనా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపింది.2001 జనాభా లెక్కల ప్రకారం యూకే స్టాటిస్టిక్స్ విభాగం సిక్కులను ఐచ్ఛిక మత ప్రశ్నలో ప్రత్యేక మతంగా గుర్తించింది.అదే సమయంలో డిజిటల్ ఫస్ట్-2021 సెన్సస్‌లో ఏ గ్రూప్‌ను కోల్పోమని నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం తెలిపింది.

Advertisement
ఇద్దరు భారత సంతతి మహిళలకు వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు!!

తాజా వార్తలు