జగన్ గారు ధన్యవాదాలు అంటున్న లోకేష్

ఎప్పుడూ ప్రభుత్వంపైనా, జగన్ పనితీరుపైనా విమర్శలు సంధిస్తూ ట్విట్స్ చేస్తూ ఉండే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఒక్కసారిగా జగన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

అయితే అదంతా ఊరికే కాదు అండి వెటకారంగా ధన్యవాదాలు తెలిపాడు.

ఇంతకీ విషయం ఏంటి అంటే ఏపీ శీతాకాల సమావేశాల సందర్భంగా పియూర సరఫరాల శాఖ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పినట్టు టీడీపీ చెప్పగా అసలు ఆ మాటే తాము అనలేదు అంటూ వైసీపీ వరించింది.

అయితే దీనిపై టీడీపీ సాక్షి పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ చూపించగా సాక్షి కూడా మీకు లాగా పొరపాటు పడింది అంటూ జగన్ చెప్పుకొచ్చారు.ఈ విషయాన్నే పరిగణలోకి తీసుకున్న లోకేష్ తన పత్రిక దొంగ పత్రిక, అందులో రాసేవి అన్నీ అసత్యాలే అని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించినందుకు ధన్యవాదాలు అంటూ లోకేశ్ చెప్పారు.

అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడును బీసీలకు అన్యాయం చేస్తున్నారు, ఒక్క రూపాయి కేటాయించలేదు అని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించినట్టు లోకేష్ గుర్తు చేశారు.బీసీలకు స్వయం ఉపాధి కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆదరణ పథకంలో అవినీతి, నాణ్యతలేని వస్తువులు ఇస్తున్నారని ప్రచారం చేసారని అన్నారు.

Advertisement

అప్పుడు చేసిన తప్పుడు ప్రచారానికి కూడా బహిరంగక్షమాపణ చెబితే బాగుంటుంది అంటూ లోకేశ్ అన్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు