అనంత బాబుకే బాబు అంటూ వైసీపీ నేత పై నారా లోకేష్ సీరియస్ కామెంట్స్..!!

వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో అనంత బాబు. కారు డ్రైవర్ ని హత్య చేయడం తర్వాత జైలుకెళ్లడం తెలిసిందే.

దీంతో అనంత బాబుని పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయటం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రజలను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని వైసీపీ నేత విక్టర్ బాబు మోసం చేసినట్లు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో తెలియజేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చెట్ల వాడు గ్రామానికి చెందిన వైసీపీ నేత విక్టర్ బాబు.గిరిజనుల నుండి లక్షల డబ్బులు వసూలు చేసి.

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్లు.అనంత బాబు కే బాబుల తయారయ్యాడని నారా లోకేష్ సోషల్ మీడియాలో ఆరోపించారు.

Advertisement

నారా లోకేష్ చేసిన కామెంట్స్."అనంత‌బాబుకే బాబులా తయారయ్యాడు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చెట్ల‌వాడ గ్రామానికి చెందిన వైసిపి నేత విక్ట‌ర్ బాబు.

గిరిజ‌నుల‌కి ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ ల‌క్ష‌లు వ‌సూలు చేసి గిరిజన యువతను మోసం చేసాడు.అప్పులు చేసి ఇచ్చిన సొమ్ముతో విక్ట‌ర్‌బాబు విలాసాలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు.

అనంత‌బాబు అండ‌తో ఏజెన్సీ ప్రాంతాల్లో విక్ట‌ర్‌బాబు అనేక అరాచ‌కాలకు పాల్పడుతున్నాడు.గిరిజ‌నుల‌కు న్యాయం చేసి, వైసీపీ నేత విక్ట‌ర్‌బాబు దోపిడీ పై ద‌ర్యాప్తు చేయాలి.

అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు