బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా లిజ్ ట్ర‌స్

బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా లిజ్ ట్ర‌స్ ఎన్నిక అయ్యారు.రిషి సునాక్ పై ఆమె విజ‌యం సాధించారు.

కాసేప‌టి క్రితం ప్ర‌ధాని ఎన్నికల ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.ఈ ఫ‌లితాల‌లో లిజ్ ట్ర‌స్ కు 81,326 ఓట్లు, రిషి సునాక్ కు 60,399 ఓట్లు వ‌చ్చాయి.

టోరీ ఓట‌ర్లు లిజ్ ట్ర‌స్ వైపు మొగ్గు చూపారు.బోరిస్ జాన్స‌న్ త‌ర్వాత లిజ్ ట్ర‌స్ బ్రిట‌న్ ప్ర‌ధానిగా కొన‌సాగ‌నున్నారు.

అయితే, ప్ర‌ధాని ప‌దవిని చేప‌ట్ట‌బోతున్న మూడో మ‌హిళ‌గా లిజ్ ట్ర‌స్ నిలిచారు.కొత్త ప్ర‌ధానిగా ఆమె రేపు ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్ట‌నున్నారు.

Advertisement
చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!