ఏపీలో మద్యం కుంభకోణం జరుగుతోంది..: పురంధేశ్వరి

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఏర్పాట్లపై వాకబు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు.చాలా సెంటర్లలో వంద కంప్యూటర్లు ఇచ్చారని తెలిసిందన్నారు.

అయితే సీఐడీ ఆ సెంటర్లకు వెళ్లిందా అని ప్రశ్నించారు.టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదని పురంధేశ్వరి పేర్కొన్నారు.

కోర్టులో హియరింగ్ వస్తుందన్న ఆమె అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.అదేవిధంగా ఏపీలో మద్యం కుంభకోణం జరుగుతోందని ఆమె ఆరోపించారు.రాష్ట్రంలో అనాధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న పురంధేశ్వరి మద్యంపై రూ.32 వేల కోట్లు ప్రభుత్వానికి వస్తుందని తెలిపారు.చీప్ లిక్కర్ తాగడంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో మద్యంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
వైరల్ వీడియో : ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్..

తాజా వార్తలు