'లైగర్'కు 7 అభ్యంతరాలు తెలిపిన సెన్సార్.. అంతగా ఏమున్నాయంటే?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

మరి వారి ఎదురు చూపులకు ఫలితంగా మరొక వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.

Advertisement
Liger Gets Seven Objections From The Censor Board Details, Vijay Deverakonda, An

లైగర్ టీమ్ అంతా ప్రెజెంట్ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.ఫ్యాన్ డమ్ పేరుతొ టీమ్ అంతా ఇండియా మొత్తం టూర్ వేస్తున్నారు.

Liger Gets Seven Objections From The Censor Board Details, Vijay Deverakonda, An

ఇదిలా ఉండగా హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.సెన్సార్ వారు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు 7 అభ్యంతరాలు తెలిపిందట.

ఎఫ్ వర్డ్ ఇంకా ఆ సిగ్నల్ కు సంకేతం చూపించే వాటికీ సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పారట.మరి ఈ 7 అభ్యంతరాలను తొలగించిందో లేదంటే మ్యూట్ చేసిందో చూడాలి.

ఇక ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పూరీ, విజయ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు