విలన్ గా ప్రభాస్ ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి..?

మొద‌టి పాన్ ఇండియా హిరో ఎవ‌రు అంటే ట‌క్కున చెప్పే పేరు ప్ర‌భాస్( Prabhas ).

సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త‌న‌కంటూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్ప‌రుచుకున్నారు.

ప్ర‌స్తుతం పాన్ ఇండియాల సినిమాలతో దూసుకెళ్తున్నారు.ప్రస్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.

కెజిఎఫ్( KGF ) చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబోలే సంస్థనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, లీక్డ్ పిక్స్ తో సినిమా అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.

Advertisement

మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్( Prithvi Raj Sukumaran ) నటిస్తున్నాడు.ఇక ప్రశాంత్ నీల్( Prashanth Neil ) అంటే.

తన సినిమాలో హీరోలు .హీరోల్లా కనిపించరు.విలన్స్ గానే కనిపిస్తారు.

ఉగ్రం, కెజిఎఫ్ 1 , కెజిఎఫ్ 2 లో హీరోలు నెగెటివ్ షేడ్స్ తోనే ఎస్టాబలిష్ అయ్యారు.ఇక ఈ పంథానే సలార్ లో చూడబోతున్నామని టాక్.

ప్రభాస్ కూడా సలార్ లో విలన్ గానే నటిస్తున్నాడని తెలుస్తుంది .ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ ఫర్మాన్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ముందుగానే చెప్పుకొచ్చాడు.అది కాకుండా విలన్ రోల్ కూడా ఉండనున్నదని సమాచారం.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ప్రభాస్ దేవా అనే పాత్ర.విలన్ అని టాక్ నడుస్తోంది.

Advertisement

అతి క్రూరమైన, కనికరంలేని.పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్ కనిపించనున్నాడని సమాచారం .పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా భయపడే రేంజ్ లో అతని పాత్రని ప్రశాంత్ నీల్ డిజైన్ చేసారని తెలుస్తుంది .ఈ విషయం తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.మా అన్నను రాఖీ భాయ్( Rakhi Bhai ) లా కంటే క‌ఠిన‌మైన విల‌న్ చూపించబోతున్నారని తెలుస్తోంది.

ఇది చాలు మా జీవితాలకు అంటూ ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు.ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజామైతే బాక్సాఫీస్ బద్దలు అవ్వడం మాత్రం ఖాయం అంటున్నరు రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్.

మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.