మొస‌లి నుంచి త‌ప్పించుకునే లోపే జింక‌ను వేటాడేసిన చిరుత‌!

కొన్ని సార్లు ఏం చేసినా మనకు కలిసి రావు.కానీ అనుకోని సంఘ‌ట‌న‌లు మ‌న‌ల్ని కుదిపేస్తుంటాయి.

ఇంకొన్ని సార్లు మనం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా జరగాల్సినవి జరుగుతూ పోతుంటాయి.అది ప్ర‌తి ఒక్క‌రి లైఫ్ లో కామ‌న్‌గా ఎప్పుడో ఒక‌సారి జ‌రుగుతుంది.

దీనిని కొందరు అదృష్టం, దురదృష్టం అని అంటే.మరి కొందరు కర్మ సిద్ధాంతం అని అంటారు.

మరి కొందరు మాత్రం ఎలా జరగాలని రాసి ఉంటే అలానే జరుగుతుందని వేదాంతం చెబుతుంటారు.ఇవన్నీ జంతువులకు కూడా జరుగుతాయి.

Advertisement
Leopard Hunting Deer Less Than Escaping From A Crocodile, Chirutha, Deer, Deer E

వాటికి సంబంధించిన వీడియోలు మనం అప్పుడప్పుడు డిస్కవరీ ఛానెల్​లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.కానీ ప్రస్తుతం ఇలాంటి వీడియోనే సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తున్నది.

జింక ప్రాణాలకు తెగించి మొసలి నుంచి తప్పించుకున్నా.తరువాత చిరుత చెరలో పడి ప్రాణాలు వదిలింది.

ఈ తతంగం అంతా ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.ఓ జింక పచ్చిక బయళ్లు తిని నీరు తాగేందుకు ఓ నది వద్దకు వస్తుంది.

Leopard Hunting Deer Less Than Escaping From A Crocodile, Chirutha, Deer, Deer E

డార్విన్ సిద్దాంతం ప్రకారం.మనుగడ కోసం పోరాటంలో భాగంగా ఓ మొసలి జింకను వేటాడేందుకు అదునుగా నదిలోపల ఎదురు చూస్తూ ఉంటుంది.జింక నీరు తాగుతుండగా మొసలిదానిపై దాడి చేసి జింకను తినేయాలని చూస్తుంది.

Aloe vera : వాస్తు ప్రకారం కలబంద ఈ దిశలో నాటారంటే.. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది..!

కానీ జింక మొసలితో పోరాడుతుంది.చివరికి దాని నుంచి తప్పించుకుంటుంది.

Advertisement

కానీ పాపం ఆ జింకకు కూడా తెలియదు తన కోసం మరో క్రూర జీవి ఎదురు చూస్తున్నదని.తన శరీరం మరో జీవికి ఆహారం కాబోతున్నదని.

నదిలో మొసలి నుంచి తప్పించుకున్న జింకపై చిరుత పులి దాడి చేస్తుంది.ఈ పోరాటంలో మాత్రం జింక ఓడిపోతుంది.

చిరుతకు బలైపోతుంది.ఇదంతా ఎక్కడ జరిగిందన్న విషయంలో క్లారిటీ లేదు.

తాజా వార్తలు