ఆమె మన కాలపు లీడర్: గ్రేటా థన్‌బెర్గ్‌పై లియోనార్డో డికాప్రియో ప్రశంసలు

పర్యావరణ మార్పులు, కాలుష్యం తదితర అంశాలపై పోరాడుతున్న స్వీడిష్ యువ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బెర్గ్‌కు ప్రపంచవ్యాప్తంగా పలువురు మద్ధతు పలుకుతున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లోకి హాలీవుడ్ సూపర్‌స్టార్, ఆస్కార్ విజేత లియోనార్డో డికాప్రియో కూడా చేరారు.

ఇప్పటికే తనవంతుగా కాలుష్యం, కార్బన ఉద్గారాలపై ప్రచారాన్ని నిర్వహిస్తున్న డికాప్రియో థన్‌బెర్గ్‌ను కలుసుకుని.ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘‘మన కాలపు నాయకురాలు’’ అంటూ కామెంట్ చేశారు.

మానవ చరిత్రలోని కొన్ని కీలకమైన సందర్భాలలో మాత్రమే కొన్ని స్వరాలు విశ్వనలుమూలలా వినిపిస్తాయని.కానీ గ్రేటా మన కాలపు నాయకురాలిగా మారారంటూ డికాప్రియో ప్రశంసించారు.

మనం ఈరోజు తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్ తరాలు ఈ గ్రహాంపై ఆనందంగా జీవించడానికి హామీ ఇస్తాయన్నారు.థన్‌బెర్గ్ పిలుపు ప్రపంచాధినేతలకు మేలు కొలుపు వంటిదని తాను ఆశిస్తున్నట్లుగా డికాప్రియో తెలిపారు.

Advertisement

థన్‌బెర్గ్‌ను కలవడం ఎంతో గౌరవంగా ఉందని.ఆమె లాంటి యువ కార్యకర్తలకు తాను ఎల్లవేళలా కృతజ్ఞతలు చెబుతానని.ఎందుకంటే భవిష్యత్తు ఏంటనేదానిపై ఆమె స్పష్టమైన అవగాహనతో ఉన్నారని లియోనార్డో పేర్కొన్నారు.

రాబోయే తరాలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించే లక్ష్యంతో పోరాడుతున్న థన్‌బెర్గ్‌కు తన మద్ధతు ఉంటుందని ఆయన తెలిపారు.టైటానిక్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న డికాప్రియో పర్యావరణం కోసం నిరంతరం పోరాడుతున్నారు.

‘‘లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్’’ (ఎల్‌డీఎఫ్)ను స్థాపించి వాతావరణ మార్పుల అధ్యయనం, సముద్రాల పరిరక్షణ, అటవీ ప్రాంతాల అభివృద్ధి, జీవ వైవిధ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా లియోనార్డో పనిచేస్తున్నారు.ఈ క్రమంలోనే 40 దేశాల్లోని దాదాపు 70 స్వచ్ఛంద సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చాడు.

అతని కృషిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి.డికాప్రియోను పర్యావరణ పరిరక్షణ దూతగా నియమించింది.

Advertisement

తాజా వార్తలు