KV Mahadevan : హీరో అవ్వాలని వచ్చి ప్రపంచమే మెచ్చే సంగీత దర్శకుడు అయ్యాడు

ఇండస్ట్రీకి వచ్చే వారిలో ఎవరైనా పెద్ద హీరో అయిపోవాలని వస్తారు.కానీ అలా జరిగితే డెస్టినీ ఎలా ఉంటుంది చెప్పండి.

ఒక్కోసారి హీరో అవ్వాలని వచ్చినవారు కమీడియన్ గా మారిపోతారు, మరి కొంతమంది విలన్స్ గా మారిపోతుంటారు.అలా అనుకున్నవి అనుకున్నట్టు జరగవు.

ఇక కొంతమంది సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చి హీరోగా సెట్ అయిన వాళ్ళు ఉన్నారు.హీరో అవ్వాలని వచ్చి డైరెక్టర్ అయిన వారు ఉన్నారు.

ఇలాంటి సంఘటనే లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కె వి మహదేవన్( Music Director KV Mahadevan ) కి కూడా జరిగింది.ఆయన మంచి నటుడు అవ్వాలని చిన్నతనం నుంచి ప్రయత్నించారు.

Advertisement

కాకపోతే ఆయన కుటుంబమంతా సంగీతం ప్రావీణ్యం ఉన్నవారే కావడంతో సంగీత దర్శకుడు అవుతాడు అనుకున్నారు కానీ మహదేవన్ కి మాత్రం అటు సంగీతంలోనూ ఇటు చదువులోనూ ఎక్కడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు.ఎక్కువగా నాటకాలు వేయడానికి ఇంట్రెస్ట్ పెట్టేవారు.

ఎదో ఒకరోజు పెద్ద హీరో అవ్వాలని అనుకోని మద్రాసు( Madras ) రైలెక్కేశారు.అక్కడికి వెళ్ళాక చాల కష్టపడాల్సి వచ్చింది.సినిమాలు రాకపోగా బ్రతకడానికి హోటల్ లో సర్వర్ గా పని చేసాడు.

జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్ళేవాడు.ఆలా పరిచయాలు పెంచుకొని అక్కడే ఉండగా, ఒక హాస్య నటుడు మహదేవన్ ని తీసుకెళ్లి తమిళం లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా( Top Music Director ) ఉన్న ఎస్ వి వెంకట్రామన్ కి అప్పగించారు, మంచి సంగీత పరిజ్ఙానం ఉంది కానీ సినిమా వేషాల కోసం జీవితాన్ని పణంగా పెడుతున్నాడు అని చెప్పగానే వెంకట్రామన్ కూడా తీసుకున్నారు.

అక్కడ మొదలైన అతడి ప్రయాణం అసిస్టెంట్ నుంచి తానే సంగీతాన్ని సమకూర్చే వరకు వెళ్లి ఏకంగా 680 కి పైగా సినిమాలకు సంగీతం అందించారు.ఈ సినిమాల ద్వారా ఎన్ని అవార్డులు దక్కాయో ఆయనకే తెలియదు.చివరగా శ్రీనాథ కవిసార్వభౌముడు( Srinatha Kavi Sarvabhowmudu ) అనే చిత్రానికి సంగీతం సగం వరకు చేసాక పక్షవాతం వచ్చి ఎవరిని గుర్తు పట్టకుండా దాదాపు పదేళ్లు పంచానికి పరిమితం అయ్యారు.

ఫ్లైట్ పైనుంచి కిందపడ్డ పెద్ద మంచు ముద్ద.. దేనిపై పడిందో తెలిస్తే..?
నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆ చిత్రాన్ని అయన శిష్యుడు పూర్తి చేయడం విశేషం.ఇక 2001 లో మహదేవన్ కన్నుమూశారు.

Advertisement

తాజా వార్తలు