హనీమూన్ లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న లావణ్య త్రిపాఠి.. ఫోటోలు వైరల్?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) తన భర్త వరుణ్ తేజ్ (Varun Tej) తో కలిసి ప్రస్తుతం ఫిన్లాండ్ హనీమూన్(Finland Honeymoon) వెకేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ నవంబర్ ఒకటో తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వివాహం తర్వాత హైదరాబాద్ డెహ్రాడూన్ లో వీరిద్దరు కూడా రిసెప్షన్ జరుపుకున్నారు.అలాగే వరుణ్ తేజ్ తన సినిమా పనులు కొంత భాగం పెండింగ్ ఉండడంతో వాటిని పూర్తిచేసి ఈయన తన భార్యతో కలిసి ఫిన్లాండ్ హనీమూన్ వెకేషన్ వెళ్లారు.

ఇలా హనీమూన్ లో ఉన్నటువంటి ఈ జంట తరచూ సోషల్ మీడియా వేదికగా వీరి హనీమూన్ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.ఇకపోతే తాజాగా లావణ్య త్రిపాఠి హనీమూన్ లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్(Christmas Celebrations) కూడా జరుపుకుంటున్నారని తెలుస్తుంది.పెళ్లి తర్వాత వీరిద్దరికి మొదటి క్రిస్మస్ కావడంతో వీరి హనీమూన్ లోనే వీరిద్దరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Advertisement

లావణ్య త్రిపాటి శాంటా క్లాస్ క్యాప్ తలకు ధరించి క్రిస్మస్ ట్రీని(Christmas Tree) అలంకరిస్తూ క్యూట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరు ముందుగానే క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారని తెలుస్తుంది.అలాగే పెళ్లి తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నారని తన సంతోషం మొత్తం తన మొహంలోనే కనపడుతుందని చెప్పాలి.

ఇలా లావణ్య త్రిపాఠి క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ దంపతులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు