Jr NTR War 2: వార్ 2 లో తారక్ కు జోడీగా నటించే లక్కీ ఛాన్స్ ఆమెను వరించిందా.. ఏం జరిగిందంటే?

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.

ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara ) నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలైంది.

ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఆ సంగతి పక్కన పెడితే ఏం కథ కొద్ది రోజులుగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో( War 2 ) నటిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్,( Hrithik Roshan ) ఎన్టీఆర్ లకు సంబంధించిన షూటింగ్ ని కూడా ప్రారంభించారు.

జనవరి నుంచి తారక్ ఆ షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

కాగా ఈ ఏడాది ఆఖరిలోపు దేవర సినిమాను పూర్తి చేయాలని ఎన్టీఆర్ అలాగే దేవర సినిమా మూవీ మేకర్స్ భావిస్తున్నారు.అందుకు అనుగుణంగానే షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు.మరోవైపు హృతిక్ రోషన్ తో స్పై థ్రిల్లర్ వార్ 2 కోసం ఎన్టీఆర్ ఇంకా వ్యక్తిగతంగా తేదీలను కేటాయించలేదని కథనాలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్ 2 లో నటించబోయే హీరోయిన్లకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

వార్ 2 లో హీరోయిన్ ల పాత్ర‌ల‌ను ఫైన‌ల్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్.అయితే వార్ 2 కోసం దీపికా పదుకొణె -అలియా భట్‌లను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఇటీవల వైఆర్‌ఎఫ్ నిర్మించే స్పై యూనివ‌ర్శ్ లో ఆలియా( Alia Bhatt ) కథానాయికగా నటిస్తోందని వార్తలు వచ్చాయి.

Advertisement

అందువల్ల వార్ 2లో ఆలియా అతిధి పాత్రలో నటించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.మరి దీపిక,( Deepika Padukone ) అలియా లలో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అన్నది తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.

తాజా వార్తలు