లతా మంగేష్కర్ తెలుగులో ఎన్ని పాటలు పాడారో తెలుసా.. మొత్తం ఎన్నంటే..

ఏడూ దశాబ్దాలకు పైగా తన పాటలతో యావత్ భారత దేశాన్ని అలరించిన గానకోకిల లతా మంగేష్కర్.

ఈమె తన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు.

సెప్టెంబర్ 28కి ఆమె 91 వ ఏట అడుగు పెడుతున్నారు.లతా మంగేష్కర్ గాత్రం అమృతంలా ఉంటుంది.

తన కెరీర్ లో లతా మంగేష్కర్ 20 భారతీయ భాషల్లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు.లతా మంగేష్కర్ దాదాపు భారతీయ అన్ని భాషల్లో పాటలు పాడారు.

ఈమెతో పాటలు పాడించుకోని సంగీత దర్శకులు లేరు అంటే నమ్మాల్సిందే.ఈమె ఎక్కువగా హిందీ పాటలే పాడారు.

Advertisement
Lata Mangeshkar Total Telugu Songs, Lata Mangeshkar, Telugu Songs,Lata Mangeshka

అయితే తెలుగులో ఎన్ని పాటలు పాడారో మీకు తెలుసా.ఈమె మిగతా భాషల్లో కంటే తెలుగులో చాలా తక్కువ పాటలే పాడారని చెప్పాలి.

ఈమె తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ పాటలు పాడక పోవడం మన దురదృష్టం.

Lata Mangeshkar Total Telugu Songs, Lata Mangeshkar, Telugu Songs,lata Mangeshka

లతా మంగేష్కర్ తెలుగు లో కేవలం మూడు పాటలు మాత్రమే పాడారు.అయితే తెలుగులో ఇంత తక్కువ పాటలు పాడడానికి కారణం మాత్రం తెలియదు.1955లో ఏఎన్నార్, సావిత్రి నటించగా.సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించిన సంతాపం సినిమాలో నిదురపోరా తమ్ముడా అనే పాట లతా మంగేష్కర్ తొలి పాట.తర్వాత 1965ల ఎన్టీఆర్, జమున నటించిన సాలూరి రాజేశ్వరరావు కంపోజ్ చేసిన దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వెంకటేశా అనే పాటను ఆలపించారు.చివరిగా మూడవ పాట నాగార్జున, శ్రీదేవి జంటగా 1988లో వచ్చిన ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీరకు పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం తో కలిసి ఆలపించారు.

ఇలా లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఈ మూడే.ఈమె మరణంతో సంగీత ప్రపంచంలో మరొక శకం ముగిసింది.భారతీయ సినీ నేపధ్య సంగీతానికి చిరునామా గా మారిన గానకోకిల లతా మంగేష్కర్ ఇకలేరు అనే వార్త ను ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఆమె గొంతు ముగా బోయింది అంటే ఇప్పటికి నమ్మలేక పోతున్నారు.దాదాపు నెలరోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

Advertisement

తాజా వార్తలు