లగడపాటి రీఎంట్రీ.. వెనకున్నదేవరు ?

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి ( MP Lagdapati Rajagopal Reddy )గురించి అందరికీ తెలిసే ఉంటుంది.2014 కంటే ముందు ఆంధ్ర కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగిన ఆయన.

రాష్ట్రం విడిపోయిన తరువాత రాజకీయ సన్యాసం తీసుకొని పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు.ఆ తరువాత నుంచి సర్వే అనలిస్ట్ గా మరి ఆంధ్ర ఆక్టోపస్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.2014 ఎన్నికల్లో టిడిపి( TDP ) గెలుపును ఖచ్చితంగా అంచనా వేయగలిగిన లగడపాటి సర్వే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే.ఇక అదే విధంగా 2019 ఎన్నికల్లో కూడా లగడపాటి సర్వే చర్చల్లో నిలిచినప్పటికి ఈసారి మాత్రం సీన్ రేవర్స్ అయింది.

గత ఎన్నికల్లో లగడపాటి సర్వేలో టిడిపి విజయం సాధిస్తుందని తెలుపగా.కానీ ఏపీ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా వైసీపీ( YCP )కి పట్టం కట్టారు.మళ్ళీ ఎన్నికల టైమ్ లో హాట్ టాపిక్ గా నిలవాల్సిన లగడపాటి.

ఎన్నికల ముందే హాట్ టాపిక్ అవుతున్నారు.దీనికి ప్రధాన కారణం మళ్ళీ ఆయన పాలిటికల్ ఋ ఎంట్రీ పై దృష్టి పెట్టడం.

తాజాగా తన అనుచరులతో రహస్య భేటీ కూడా నిర్వహించరాట లగడపాటి రాజగోపాల్.తాను రాజకీయాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే ఇలా ఉంటుంది ? గతంలో మాదిరి తనకు ఆధారణ లభిస్తుందా ? ఒకవేళ పోలిటికల్ రీ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరాలి ? అనే విషయాలను తన అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

అనుచరులు కూడా పోలిటికల్ రీ ఎంట్రీ ( Political re-entry )ని స్వాగతించారట.ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఆయన టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉండని టాక్.గతంలో గడపాటి సర్వేల వెనుక చంద్రబాబు( Chandrababu ) హస్తం ఉందనే టాక్ కూడా గట్టిగానే వినిపించింది.

అందువల్ల లగడపాటి పోలిటికల్ రీ ఎంట్రీ టీడీపీ నుంచే ఉండబోతున్నాట్లు సమాచారం.మరి సర్వేలతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన లగడపాటి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడనే టాక్ రావడంతో ఏపీ పాలిటిక్స్ వేడెక్కాయి.

మరి ఆయన ఏ పార్టీలో చేరతారో చూడాలి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

తాజా వార్తలు