పెళ్లయిన 3 నిమిషాలకే డివోర్స్ తీసుకున్న కువైట్ కపుల్.. ఎందుకో తెలిస్తే..?

పెళ్లి అంటే నూరేళ్లు పంట.వివాహంతో ఒక్కటైన తర్వాత కలకాలం కలిసి ఉండాలని భార్యాభర్తలు ట్రై చేస్తారు.

ప్రమాణం కూడా చేసుకుంటారు.ఇద్దరి మధ్య ఎన్ని తేడాలున్నా అన్నిటిని అంగీకరిస్తూ జీవితకాల బంధంలోకి అడుగు పెడతారు.

అయితే కొందరు మాత్రం చిన్న విషయాలకే గొడవపడి డివోర్స్( Divorce ) తీసుకుంటారు.ఈ మధ్యకాలంలో కొన్ని జంటలు ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకుంటున్నారు.

అయితే తాజాగా ఒక కపుల్ పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు తీసుకొని మొత్తం ప్రపంచానికే షాక్ ఇచ్చింది.దీనికి కారణం ఏమిటంటే, వివాహ వేడుక ముగిసి కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్నప్పుడు వధువు( Bride ) కాళ్లకు ఏదో తగిలి కింద పడిపోయింది.

Advertisement

అప్పుడు వరుడు ఆమెను స్టుపిడ్( Stupid ) అని తిట్టాడు.కింద పడిపోతే అయ్యో పాపం అని ఆమెకు చెయ్యి అందించి పైకి లేపాల్సిన భర్త ఇలా తిట్టడంతో సదరు వధువు తీవ్ర కోపానికి లోనయ్యింది.

ఇలాంటి పడతారు అనుకోవద్దు అంటూ ఆమె గోల చేసింది.అంతే కాదు వెంటనే వివాహాన్ని ( Wedding ) రద్దు చేయమని న్యాయమూర్తిని కోరింది.

అదే న్యాయమూర్తి ఈ జంటకు పెళ్లి చేశారు.మళ్లీ అదే జడ్జి ఆమె కోరికను మన్నించి, వివాహాన్ని రద్దు చేశారు.ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయం పాటు నిలిచిన వివాహంగా రికార్డు క్రియేట్ చేసింది.

వరుడు తన వెడ్డింగ్ స్పీచ్‌లో( Wedding Speech ) తన భార్యను హేళన కూడా చేశాడు.ఇతనొక్కడే కాదు తండ్రి కూడా వధువును చులకన చేస్తూ మాట్లాడాడు.ఇలా ఆమెకు ఈ వరుడు ఫ్యామిలీ బాగా కోపం తెప్పించింది.

టాలీవుడ్ లో ఇలాంటి ఒక అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ ని ఇన్నేళ్లకు గుర్తించారా ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న జో బైడెన్

ఈ సంఘటనపై చాలా మంది నెటిజన్లు స్పందించారు."నేను ఒక పెళ్లికి వెళ్ళాను, అక్కడ వరుడు తన భార్యను హేళన చేస్తూ ప్రసంగం చేశాడు.

Advertisement

అతని తండ్రి కూడా అలాగే చేశాడు.ఈ మహిళలాగా ఆమె కూడా చేసి ఉండాల్సింది," అని ఒక వ్యక్తి ట్విట్టర్‌లో రాశాడు.

"గౌరవం లేని పెళ్లి మొదటి నుంచే విఫలమైనదే," అని మరొకరు రాశారు."వరుడు మొదట్లోనే ఇలా ప్రవర్తిస్తే, అతన్ని వదిలేయడమే మంచిది," అని మరొకరు అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు