వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా..!

కర్నూలు జిల్లాలో( Kurnool District ) అధికార పార్టీకి వైసీపీకి షాక్ తగలింది.ఆ పార్టీకి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్( MP Dr.

Sanjeev Kumar ) రాజీనామా చేయనున్నారు.వైసీపీ అధిష్టానం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోడంతో పార్టీ తీరుపై డాక్టర్ సంజీవ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

సంజీవ్ కుమార్ ను కాదని మంత్రి జయరాంకు( Minister Jayaram ) పార్టీ హైకమాండ్ టికెట్ కేటాయించింది.ఈ నేపథ్యంలోనే పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.అయితే ఎంపీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని సంజీవ్ కుమార్ ప్రకటించారు.

ఫిబ్రవరిలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న సంజీవ్ కుమార్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Advertisement
ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?