సినిమా ప్రపంచం పైకి మాత్రం అందంగానే కనిపిస్తుంది, లోపలికి వెళ్తేనే అందులోని చీకటి కోణాలు ఎన్నో బయటపడతాయి.
క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఇతరులను తొక్కేసే రాజకీయాల వరకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటాయి.
అలాంటి సినీ రాజకీయాలకు తాను బలైపోయానని ప్రముఖ నటి పద్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నటి పద్మ( Actress Padma ) ప్రముఖ సినిమా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పై సంచలన ఆరోపణలు చేసింది.కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో తన వద్దకు వచ్చి రెండో పెళ్లి చేసుకుంటావా? అని వీరేంద్రనాథ్ అడిగాడని, అందుకు తాను నిరాకరించడంతో అవకాశాలు రాకుండా చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.1986 వరకు తాను మొండిఘటం, కుక్క వంటి చాలా సినిమాల్లో నటించానని కానీ ఆ తర్వాత ఒక్క అవకాశం కూడా రానివ్వకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి తనని యండమూరి వీరేంద్రనాథ్( Yandamuri Virendranath ) బయటికి వెళ్ళగొట్టాడని ఆరోపణలు చేస్తూ ఎమోషనల్ అయ్యింది.
తాను ఒక పిచ్చిదానినని ఇండస్ట్రీలో యండమూరి వీరేంద్రనాథ్ చిత్రీకరించాడని, చివరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదని ఆమె కంటతడి పెట్టుకుంది.ఈ విషయం తెలిసిన తర్వాత తండ్రి నచ్చజెప్పి సూరిబాబు( Suribabu ) అనే వ్యక్తితో తన పెళ్లి చేశాడు అని పేర్కొంది.సూరిబాబుకు ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి తర్వాత తెలిసి ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని పేర్కొంది.
ఆపై విడాకులు తీసుకున్నానని వెల్లడించింది.
నటి పద్మ ఇంకా మాట్లాడుతూ తన తండ్రి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పింది.సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా డబ్బులు రాకపోయాయని తెలిపింది.అందువల్ల తండ్రి డబ్బులు పైనే ఆధారపడాల్సి వచ్చేదని వెల్లడించింది.
తండ్రి తో పాటు కుటుంబ సభ్యులందరూ చనిపోవడంతో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని తెలిపింది.తనకు సినిమాల్లో డబ్బింగ్ చెప్పుకునే అవకాశాల్ని కూడా రానివ్వకుండా యండమూరి వీరేంద్రనాథ్ ఇప్పటికీ ఆపుతున్నాడని ఆమె కామెంట్స్ చేసింది.
మరి దీనిపై వీరేంద్రనాథ్ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy