కేటీఆర్ పంచ్ : నల్లధనం అని తెల్ల మొఖం వేశారే ? 

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో బిజెపి పైన, ప్రధాని నరేంద్ర మోదీ పైన పంచ్ లు వేస్తూ అనేక విమర్శలు చేశారు.

ఈ రోజు మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా బీజేపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు .ముఖ్యంగా అగ్నిపథ్ పై ఆందోళనలు దేశవ్యాప్తంగా చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా కేటీఆర్ సెటైర్లు వేశారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది.

బీజేపీ నేతలు దేశాన్ని రావణకాష్టంలా గా మార్చారు.దేశంలో గ్యాస్ సిలిండర్ ధర 400 నుంచి 1000 దాటింది.

నల్లధనం తెస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ .నేడు తెల్లముఖం వేశారు.తంబాకు తినడం తప్ప బండి సంజయ్ కు ఏమీ తెలియదు.

Advertisement

కాంగ్రెస్ పార్టీ కి ఇక కాలం చెల్లింది.కాంగ్రెస్ కు చరిత్ర మిగిలింది.

రాహుల్ గాంధీని గంటల తరబడి ఆఫీస్ లో కూర్చోబెట్టినా అడిగేవారు లేరు.ఒక్క ఛాన్స్ అని రాహుల్గాంధీ అడుగుతున్నారు.

దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే యాభై ఏళ్ళ అధికారం ఇచ్చారు.అప్పుడు ఏమీ చేయలేని వాళ్ళు ఇప్పుడేం చేస్తారు అంటూ కేటీఆర్ బిజెపి-కాంగ్రెస్ ల పై విమర్శలు చేశారు.

గత కొంతకాలంగా కాంగ్రెస్ బిజెపిలు తెలంగాణాలో దూకుడు పెంచుతూ టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎప్పటికప్పుడు కేటీఆర్ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ వారిపైన, జాతీయ నాయకత్వం పైన విమర్శలు తీవ్రంగా చేస్తున్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టనున్న అగ్నిపత్ పథకంపై, నిన్న సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనలపై న కేటీఆర్ స్పందించి విమర్శలు చేశారు.నిరుద్యోగుల జీవితాలతో బిజెపి ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు.ఇక ఇదే సభలో బీజేపీ తీరుపై మంత్రి హరీష్ రావు కూడా ఘాటుగానే స్పందించారు.

Advertisement

భారత ఆర్మీ ప్రైవేటుపరం చేసే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన మండిపడ్డారు.ఆర్మీ లోనూ కాంట్రాక్టు ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.