చిట్టినాయుడూ నువ్వా ... కేసీఆర్ పేరును తుడిచేది ? 

చిట్టి నాయుడు నువ్వా కేసీఆర్( KCR ) పేరును తుడిచేది ?  తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సీఎం రేవంత్ రెడ్డి పై( CM Revanth Reddy ) తీవ్ర విమర్శలు చేశారు.

మరి కొన్ని రోజుల్లో తెలంగాణ రాజకీయాల నుంచి కెసిఆర్ పేరు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

  తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరు చేరిపితే చెరిగేది కాదని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేటీఆర్.

రేవంత్ మీరు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసారు.

Ktr Counter To Cm Revanth Reddy Comments On Kcr Details, Kcr, Telangana, Ktr, Kt

పదవుల కోసం పరితపిస్తున్నాడు ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశారు.  ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారు .నువ్వు సాధించుకున్న తెలంగాణను( Telangana ) చంపేందుకు బ్యాగులు మోస్తున్న నాడు ఆయన తెలంగాణ భవిష్యత్తు కు ఊపిరి పోసారు.చిట్టినాయుడు నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది.

Advertisement
Ktr Counter To Cm Revanth Reddy Comments On Kcr Details, KCR, Telangana, Ktr, Kt

తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు.  కాంగ్రెస్( Congress ) పాలనలో రైతులు గోస పడుతున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు. 

Ktr Counter To Cm Revanth Reddy Comments On Kcr Details, Kcr, Telangana, Ktr, Kt

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.  మూసి పై ముందుకు కొనుగోళ్లపై వెనక్కి రామన్నపేటకు రైరై కొనుగోలు సెంటర్లకు నై నై .రామగుండం ధనాధన్ - ధాన్యం కొనుగోళ్లు డాం డాం.కొనుగోళ్లకు దిక్కులేదు కాంగ్రెస్ కోతలకు లెక్కలేదు.దళారులకు దండిగా రైతన్నలకు దండగ,  నాడు క్వింటాలకు 2,300 అమ్ముకున్న రైతు కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని నేడు 1800 అమ్ముకుంటున్నారు.

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుండదు   అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు