కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. !

ప్రస్తుతం తెలంగాణలో పాలన పడకెస్తుందని ఊహిస్తున్నారట కొందరు.ఇంత వరకు ఏకచత్రాధిపత్యంలా దూసుకెళ్లుతున్న టీఆర్ఎస్ కు ఎదురన్నదే లేదు.

కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి గొంతు విప్పుతున్న బలంగా జత కలిసే నేతలు లేక రేవంత్ అరుపులు వానలో కన్నీటి చుక్కలుగా మారాయట.ఇక కారు సీటు దిగిన ఈటల ప్రస్తుతం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

KTR Fires On Congress And BJP Leaders, Telangana, KTR, Comments, Congress, BJP L

మరి రేవంత్ చేయలేని పని ఈటల చేస్తారేమో చూడాలని నేతలందరు ఆసక్తితో ఎదురు చూస్తున్నారట.ఈ క్రమంలో గులాభి పార్టీ చిన్న బాస్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ నేత‌లు అభివృద్ధి నిరోధ‌కులుగా మారారంటు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణలా మార్చాలని సీఎం కేసీఆర్ శ్రమిస్తుంటే కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోని పార్టీలు తెలంగాణ అభివృద్ధికి అడ్దంకిగా మారుతున్నారంటూ విమర్శించారట.అయిన మనలో మన మాట తెలంగాణ వచ్చి దాదాపుగా ఏడు సంవత్సరాలు అవుతుంది.

Advertisement

మరి బంగారు తెలంగాణ బాధల తెలంగాణ అవుతుందనే వార్తలు ఎందుకు వస్తున్నట్లో ప్రజలకు అసలే అర్ధం కావడం లేదట.ఏది ఏమైన ఎదుటి వారిని విమర్శించాలనే కసిని రాష్ట్ర అభివృద్ధి పై చూపిస్తే బాగుండు అని అనుకుంటున్నారట జనం.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు