కృష్ణంరాజు గారి లైఫ్ లో తీరని మూడు కోరికలు ఇవే!

రెబల్ స్టార్ కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యాలతో బాధ పడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.ఈ రోజు తెల్లవారు జామున కృష్ణం రాజు(83) చికిత్స పొందుతూ 3.

25 గంటలకు కన్నుమూసినట్టు తెలుస్తుంది.ఈయన ప్రభాస్ పెద్దనాన్న అని తెలిసిందే కృష్ణం రాజుకు మొగపిల్లలు లేకపోవడంతో ప్రభాస్ నే తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.

ఈయనకు భార్య శ్యామలాదేవి.ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

అయితే కృష్ణం రాజు మరణ వార్త విని ఈ రోజు టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈయన ఫ్యాన్స్ అంతా ఈయన లేరనే వార్త తెలియడంతో దుఃఖ సాగరంలో మునిగి పోయారు.

Advertisement
Krishnam Raju Last Wishes Not Fulfilled, Krishnam Raju, Last Wishes, Prabhas, Re

ఇక ఈయన కెరీర్ లో మూడు కోరికలు అలాగే మిగిలి పోయాయని అవి తీరకుండానే ఈయన మరణించారని వినికిడి.మరి ఆ మూడు కోరికలు ఏంటంటే.

కృష్ణం రాజు ఒక చిన్న స్టూడియో కట్టాలని ఆశ పడ్డారట.తన తరుపున తన కుటుంబానికి కానుకగా ఒక స్టూడియో కట్టి ఇవ్వాలని అందుకోసం ఈయన రాజకీయంగా కూడా చాలా ప్రయత్నాలు చేసారని.

కానీ పని అవ్వలేదని తెలుస్తుంది.ఇక ఈయన రెండవ కోరిక ప్రభాస్ పెళ్లి.

ఈయన బ్రతికుండగానే ప్రభాస్ పెళ్లి చేయాలనీ ఆశ పడ్డారని.కానీ ఈ పెళ్లిని ప్రభాస్ వాయిదా వేస్తూ రావడంతో డార్లింగ్ పెళ్లి చూడకుండానే ఈయన మరణించారు.

Krishnam Raju Last Wishes Not Fulfilled, Krishnam Raju, Last Wishes, Prabhas, Re
నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

దీంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో బాధ పడుతున్నారు.ఇక మూడవ కోరిక ఏంటంటే.తన డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఒక్క అడుగు సినిమాను నిర్మించాలని ఆ స్క్రిప్ట్ కూడా పూర్తి చేసుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆయన మరణించారు.

Advertisement

ఈ విషయాలు తెలిసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ మరింత బాధ పడుతున్నారు.

తాజా వార్తలు