కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS party )కు పెద్ద చిక్కే వచ్చి పడింది.
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు, ఏపీలోను బీఆర్ఎస్ ను విస్తరించేందుకు, అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
దీనికి తగ్గట్లుగానే ఒక్కో రాష్ట్రంలో పట్టు పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే విధంగా ఏపీలోనూ బీఆర్ఎస్ ను భారీగా విస్తరించేందుకు ఇప్పటికే ఏపీ కి బీఆర్ఎస్ అధ్యక్షుడిని నియమించారు.
తోట చంద్రశేఖర్ ఏపీ బీజేఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చేరికలు ఉండే విధంగాను, పార్టీకి జనాల్లో ఆదరణ పెరిగే విధంగాను కొన్ని కొన్ని ప్రధాన అంశాలపై ఆ పార్టీ ఫోకస్ చేసింది.
దీనిలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో పాటు, పోలవరం పైన పదేపదే తెలంగాణ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు.పోలవరం మేమే పూర్తి చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దేనికైనా సిద్ధం అని మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్ వంటి వారు ప్రకటించారు.
ఇక భారీ ఎత్తున ఉత్తరాంధ్రలో బీఆర్ఎస్ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉండగానే కృష్ణా జలాల్లో( Krishna water ) ఏపీకి కేటాయించిన నీటిని కూడా తమకే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం వద్ద డిమాండ్ వినిపిస్తోంది.ఏపీకి న్యాయంగా కేటాయించిన నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం తమకు కేటాయించాలని కోరుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 2017 లో ఒప్పందం జరిగింది.కృష్ణానది జలాల వినియోగంలో ఏపీ తెలంగాణలో మధ్యన 66 : 34 నిష్పత్తిలో నీటి కేటాయింపులు కుదుర్చుకున్నాయి.అప్పుడు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది.
బచావత్ చేసిన 811 టిఎంసిల నీటి కేటాయింపులు తెలంగాణకు 299 టీఎంసీలు ,ఏపీకి 512 టిఎంసిలు వినియోగించుకునే విధంగా ఒప్పందలు జరిగాయి.ఇప్పటికీ అవి కొనసాగుతూ వస్తుండగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) తమకు 50 శాతం వాటా కావాలంటూ డిమాండ్ చేస్తుంది.త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉండడం, ప్రతిపక్షాలు ఇదే అంశం పై ఇరుకున పెట్టే విధంగా వ్యూహాలు పన్నే అవకాశం ఉండడంతో, కృష్ణానది జలాల వ్యవహారంలో బీఆర్ఎస్ దూకుడు చూపిస్తోంది.
అయితే ఈ వ్యవహారాలు ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు స్పీడ్ బ్రేకర్లుగా మారే అవకాశం ఉందనే ఆందోళన ఆ పార్టీ నాయకుల్లోను, రాజకీయ వర్గాల్లోనూ కలుగుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy