క్రాక్‌ సందడి లేదు.. ఆ హడావుడి అస్సలే కనిపించడం లేదు

సంక్రాంతికి టాలీవుడ్‌ నుండి క్రాక్‌, రెడ్‌ మరియు అల్లుడు అదుర్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.క్రాక్‌ సినిమా కాస్త ముందు విడుదలకు సిద్దం అవుతుంది.

మరో రెండు రోజుల్లో రాబోతున్న క్రాక్‌ సినిమాకు సంబంధించిన సందడి పెద్దగా కనిపించడం లేదు.గత సంక్రాంతి సీజన్‌ లో వచ్చిన సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

కాని ఈసారి పరిస్థితి వేరుగా ఉంది.భారీ ఎత్తున అంచనాల నడుమ క్రాక్‌ తెరకెక్కింది.

కాని కరోనా కారణంగా గ్యాప్ రావడంతో సినిమా విడుదల విషయంలో గందరగోళం నెలకొంది.ఇప్పుడు థియేటర్లు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే రన్‌ అవుతున్నాయి.

Advertisement

ఆ మాత్రం దానికి కూడా జనాలు వస్తారా రారా అనే అనుమానాలు ఉన్నాయి.అయినా కూడా క్రాక్‌ ను విడుదల చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్‌ క్లీయర్ గా కనిపిస్తుంది.కరోనా కారణంగా క్రాక్‌ సందడి ఎక్కడ కనిపించడం లేదు.ఇటీవల క్రాక్‌ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది.

దానికి జనాలు లేరు.కేవలం మీడియా వారు కొద్ది మంది చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

గతంలో వేలాది మంది ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొనే వారు.కాని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఇక సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే యూనిట్‌ సభ్యులు ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్‌ లు హడావుడి ఉండేది.కాని క్రాక్‌ సినిమా కు మాత్రం ఆ జోరు సందడి హడావుడి ఎక్కడ కనిపించడం లేదు.

Advertisement

సమ్మర్‌ లో విడుదల కాబోతున్న సినిమాకు అయినా ఆ హడావుడి ఉంటుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.క్రాక్‌ సినిమా విడుదలకు ముందు సైలెంట్‌ గా ఉన్నట్లుగానే విడుదల తర్వాత కూడా ఇలాగే ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా వార్తలు