తారక్ కోసం బాలీవుడ్ యాక్టర్‌ను దించుతున్న కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.

కాగా ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు తారక్.ఈ సినిమా తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా రానుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేసిన తారక్, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో పలువురు స్టార్ యాక్టర్స్‌ను తీసుకునేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బొమన్ ఇరానీని తీసుకునేందుకు కొరటాల సిద్ధమయ్యాడు.

Advertisement

కథలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని, అందుకే విలక్షణ నటుడైన బొమన్ ఇరానీ అయితే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలడని కొరటాల భావిస్తున్నాడు.దీంతో తారక్ కోసం బొమన్ ఇరానీని మరోసారి తెలుగు తెరపై చూపించే ప్రయత్నం సాగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక గతంలో బొమన్ ఇరానీ పవన్ కళ్యాన్ నటించిన అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి చిత్రాల్లో నటించారు.ఇప్పుడు తారక్ చేయబోయే సినిమాలో నటించనుండటంతో ఈ సినిమాలో బొమన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుండగా, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

పైల్స్ వ్యాధి వేధిస్తుందా? ఈ సూప‌ర్ ఫుడ్స్ తో నివారించుకోండిలా!
Advertisement

తాజా వార్తలు