తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది.
గత కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా రెగ్యురల్ షూట్ కూడా ఏప్రిల్ నుండి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ NTR30.ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.మరి ఈ సినిమా లాంచ్ కోసం ఎంతో కాలంగా తారక్ ఫ్యాన్స్ ఎదురు చూసారు.
ఎట్టకేలకు ఈ సినిమా త్వరలోనే రెగ్యురల్ షూట్ కు కూడా వెళ్లనుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ అందించారు.ఈ రోజు 11 గంటలకు సాలిడ్ అప్డేట్ ఇస్తున్నట్టు ముందు నుండి బజ్ వినిపించింది.మరి వచ్చిన బజ్ నిజం చేస్తూ ఈ రోజు ఈ సినిమా నుండి మేకర్స్ మంచి న్యూస్ అందించారు.
ఇందులో మరొక హాలీవుడ్ టెక్నీషియన్ యాడ్ అయినట్టు కన్ఫర్మ్ చేసారు.ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం బ్రాడ్ మిన్నిచ్ ను టీమ్ లోకి ఆహ్వానించారు.
ఈయన ఎన్నో హాలీవుడ్ ( Hollywood) మూవీస్ కు పని చేసిన అనుభవం ఉంది.ఈయన ఈ టీమ్ లో జాయిన్ అయినట్టుగా అప్డేట్ ని అందించారు.ఈ మేరకు కొరటాల, బ్రాడ్ మిన్నిచ్ (Brad Minnich) పిక్ ను షేర్ చేసారు.
మరి ఈయన హాలీవుడ్ పరిజ్ఞానం మన తెలుగు సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుందో కొరటాల ఈ సినిమాలో విజువల్స్ ను ఏ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తారో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy