కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేత : భగ్గు మంటున్న దళిత సంఘాలు

దళిత బాంధవుడని ఎస్సీ ఎస్టీ వర్గాల్లో పేరు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి( CM Jagan Mohan Reddy ) ఇప్పుడు వారి ప్రయోజనాలకు విఘాతం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అమలాపురంలో అంబేద్కర్ జిల్లా పేరు విషయంలో జరిగిన అల్లర్లు తీవ్ర సంచలనాలు కలిగించాయి .

కోనసీమ జిల్లా( Konaseema ) పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చినందుకు అక్కడ కొన్ని సామాజిక వర్గాలు రోడ్లపై కొచ్చి అల్లర్లు సృష్టించాయి.భయభ్రాంతులకు గురి అయ్యే సంఘటనలు కూడా జరిగాయి.

మంత్రి పీనేపే విశ్వరూప్( Minister Pinipe Viswarup ) ఇంటికి కొంత మంది దుండగులు నిప్పు పెట్టారు .మరి కొంత మందిపై బౌతీక దాడులు కూడా జరిగాయి .అప్పట్లో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై రియస్గా దృష్టి పెట్టి కొంతమంది అరెస్టులు కూడా చేశారు .కొన్ని కులాలు పనిగట్టుకుని గొడవలు చేశాయని కూడా ప్రభుత్వం ఆరోపించింది మరి ఇప్పుడు హఠాత్తుగా కేసులని ఎత్తు వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వెనక మూలకారణాలు ఏమైనా సరే దళితుల్లో ఈ వ్యవహారం పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది.

Konaseema Cases Withdrwan By Jagan Govt Details, Konaseema, Konaseema Riots, Ycp

ఇప్పటికే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మళ్లించడం, దళితులను హింసించే సంఘటనలో సరైన చర్యలు తీసుకోవడం వంటి విషయాల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి తో ఉన్న దళిత సంఘాల కు ఇప్పుడు ఈ కేసులు ఎత్తివేత పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుంది.గత ఎన్నికలలో జగన్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణాల్లో దళిత ఓటు బ్యాంకు కూడా ఒకటి.151 ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగారంటే మెజారిటీ స్థానాల్లో దళిత ఓట్ల మద్దతు ఉండటమే కారణం మరి ఇప్పుడు ఏ సమీకరణాలను ఆయన లెక్కలోకి తీసుకుంటున్నారో తెలియదు కానీ దళితులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న ఈ నిర్ణయానికి సరైన మూల్యం చెల్లించాల్సింది అన్నట్టు సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Konaseema Cases Withdrwan By Jagan Govt Details, Konaseema, Konaseema Riots, Ycp
Advertisement
Konaseema Cases Withdrwan By Jagan Govt Details, Konaseema, Konaseema Riots, Ycp

దీనిపై మాట్లాడిన జై భీమ్ పార్టీ వ్యవస్తపాకుడు , న్యాయవాది శ్రావణ , కేసులు ఎత్తివేయడమంటే అంబేద్కర్ ని అవమానించడమేనంటూ తెలిపారు .దీనిని కోర్ట్ లో సవాలు చేస్తామని ఆయన ప్రకటించారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవంతో కొన్ని వర్గాలను సంతృప్తి పరచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని దానిలో భాగంగానే అధిక సంఖ్యలో ఉన్న కాపులను సంతృప్తి పరచడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇప్పటికే మెజారిటీ కాపులు జనసేన వైపు నిలబడుతున్నారన్న అంచనాలు వస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారని కొంతమంది అంటున్నారు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు