చెర్రీకి సన్నాఫ్‌ సత్యమూర్తి!!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ‘నా పేరే రాజు’.

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు కొలవెరిడీ ఫేం అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

అయితే ఇప్పుడేం జరిగిందే ఏమో కాని తాజాగా ఈ సినిమా నుండి అనిరుధ్‌ను తప్పించి, దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.ఈ విషయంపై త్వరలోనే నిర్మాత దానయ్య లేదా దర్శకుడు శ్రీనువైట్ల ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాకు మంచి సంగీతాన్ని అందించి దేవిశ్రీ మెగాపవర్‌ స్టార్‌ మనస్సును దోచుకున్నాడు.ఇటీవలే విడుదలైన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

దానికి తోడు అనిరుధ్‌ అందించిన రెండు ట్యూన్స్‌ కూడా తమిళ ప్లేవర్‌తో ఉన్నాయని, అందుకే ఆయన్ను ఈ సినిమా నుండి తప్పించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలున్నాయి.

Sania Mirza Shoaib Malik : ఔను సానియా, షోయబ్ మాలిక్ విడిపోయారు..?
Advertisement

తాజా వార్తలు