చిరంజీవి పాటలకు విరాట్ కొహ్లీ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడా.. అసలేం జరిగిందంటే?

ఏంటి! చిరంజీవి పాటలకు విరాట్ కోహ్లీ( Virat Kohli ) డాన్స్ చేసేవాడా అంటే అవుననే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన అండర్‌ 15 రోజుల్లో మన టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి( Megastar Chiranjeevi ) పాటలను బాగా ఆస్వాదించేవాడట.

అంతే కాకుండా ఆ పాటలకు డాన్స్ లు చేయడంతో పాటు, తన ఫేవరెట్‌ ప్లే లిస్ట్‌ లో కూడా చిరంజీవి పాటలకు( Chiranjeevi Songs ) చోటు కల్పించాడు అంటూ ద్వారకా రవితేజ( Dwaraka Ravi Teja ) అన్నాడు.ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన రవితేజ గతంలో కోహ్లీకి సహచరుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అండర్‌ 15 రోజుల్లో కోహ్లీ తన కు రూమేట్ అని, ఆ సమయంలో ఇద్దరం కూడా ఒకరిని ఒకరం చిరు చిరు అంటూ పిలుచుకునే వాళ్లం అని తెలిపారు రవితేజ.దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కలిసి నన్ను చిరు కైసే హై తు అన్నాడు.రూమ్ లో నేను టీవీలో చిరంజీవి పాటలను పెడితే వాటికి కోహ్లీ డాన్స్( Kohli Dance ) వేస్తూ ఎంజాయ్‌ చేసేవాడు అని చెప్పుకొచ్చాడు ద్వారకా రవితేజ.

అండర్ 19 భారత జట్టు లో ఇండియా జట్టులో కూడా కోహ్లీతో కలిసి ఇండియన్ జర్సీని ద్వారకా రవితేజ షేర్ చేసుకున్నాడు.

Advertisement

కోహ్లీ తో తనకు ఉన్న అనుబంధం గురించి ఇటీవల ఒక సందర్భంలో షేర్‌ చేసుకున్న రవితేజ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈ సందర్భంగా ద్వారకా రవితేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేరేలవడంతో చాలామంది ఈ విషయం విని ఆశ్చర్యపోతున్నారు.నిజమా అవునా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు