కోడి రామకృష్ణ కన్నీటి కథ : పగలు చదువు, రాత్రయితే పెయింటింగ్

తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న దిగ్గజ దర్శకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందులో ది గ్రేట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ పేరు కూడా ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో 130 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి తనకు తిరుగులేదు అని నిరూపించాడు కోడి రామకృష్ణ .

ఎంతో మంది స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసి కోట్ల మంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు.కేవలం తెలుగు భాషలో మాత్రమే కాదు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలకు దర్శకత్వం వహించారు కోడి.

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమా ద్వారా కోడి రామకృష్ణ దర్శకుడిగా అవతారం ఎత్తాడు.తీసిన మొదటి సినిమానే మంచి విజయం సాధించింది.దీంతో ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.

ఇక ఎలాంటి కాన్సెప్ట్ అయినా సరే తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడంలో కోడి రామకృష్ణ దిట్ట అని చెప్పాలి.ఒక వైపు కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు తీస్తూనే మరోవైపు రాజకీయ, సామాజిక స్పృహ కల్పించే సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు కోడి రామకృష్ణ.

Advertisement

అంతేకాదు అసలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం లేని గ్రాఫిక్స్ ని పరిచయం చేసింది కూడా కోడి రామకృష్ణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఆయన స్వస్థలం పాలకొల్లు.తల్లిదండ్రులు చిట్టెమ్మ, నరసింహమూర్తి.అయితే ఆయన ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారట.

పగలంతా ఒక వైపు చదువుకుంటూనే ఇక రాత్రి అయితే పెయింటింగ్ వర్క్ చేస్తూ కొంత మొత్తంలో సంపాదించేవారట.ఇలా వచ్చిన డబ్బును ఇక తన స్కూల్ ఫీజుల కోసం ఉపయోగించుకునేవారట.

చిన్నప్పటి నుంచి సినిమాలంటే తెగ ఇష్టం పెంచుకున్న కోడి రామకృష్ణ మొదట్లో పాలకొల్లులో నాటకాలు వేస్తూ తన కెరీర్ ని మొదలుపెట్టారు.డిగ్రీ పూర్తి చేశాక దాసరి గారి దగ్గర అసిస్టెంట్ చేరాడు.

అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది.చివరికి డైరెక్టర్ గా అత్యున్నతమైన రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని కూడా అందుకున్నారు కోడి రామకృష్ణ.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు