జూనియర్ కోడెల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది .
తెలుగుదేశం పార్టీలలో అత్యంత సీనియర్ నాయకుల్లో దివంగత కోడెల శివప్రసాద్ రెడ్డి( Kodela Sivaprasad Reddy ) కూడా ఒకరు.
నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన కొత్తల్లో ఆయన ఇచ్చిన పిలుపుమేరకు ప్రభుత్వ డాక్టర్ అయిన ఆయన తన ఉద్యోగాన్ని సైతం పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు.సత్తెనపల్లి నియోజకవర్గంలో 5 సార్లు ఎంఎల్ఏ గా గెలిచి తిరుగులేని నేతగా రికార్డు విజయాలను నమోదు చేశారు .అయితే ఆయన అధికారం చలాయించే సమయంలో ఆయన కొడుకు అవినీతి పై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి.వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన కేసులు పెట్టి వేధించింది .ఆ వేదింపులు తట్టుకోలేక ఆయన 2019 లో ఆయన తన నివాసం లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.అయితే చాలా చోట్ల వారసులకు టిక్కెట్లు ఇస్తున్న టిడిపి అధిష్టానం కోడెల శివరాం మీద ఉన్న ఆరోపణలతో ఇప్పుడు ఆ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణ ను ప్రోత్సహిస్తుంది.
సత్తెనపల్లి నియోజకవర్గ( Sattenapally Constituency ) టిడిపి ఇన్చార్జిగా ఆయనను నియమించింది ,అదే ఇప్పుడు కోడెల తనయుడు శివరాం ఆగ్రహానికిగురిచేసింది .ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని అదికార పార్టీ వేదింపులు తట్టుకుని .ఆస్తులు కూడా పోగొట్టుకున్న తమపై పార్టీ ఇంత వివక్ష చూపడం తగదని ఆయన మీడియా సాక్షిగా ఆవేదన చెందారు .ఎంతోమంది కుటుంబాలను వాళ్ళ వారసులను ఎంకరేజ్ చేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) తమ కుటుంబం మీద మాత్రం కక్షసాదింపు చర్యలకు పాల్పడుతుందని ఆయనఆరోపణలు చేస్తున్నారు .
పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఆ దిశగా నియోజకవర్గ కార్యకర్తలతో వరుసపెట్టి మీటింగులు పెట్టి ఆ అభిప్రాయానికి వచ్చారని తెలుస్తుంది.అదే గనక జరిగితే అక్కడ తెలుగుదేశం అభ్యర్థికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది .ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న వైసిపి అధిష్టానం టిడిపి అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాల్సిందిగా కోడెల శివరామను అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది.మరి జూనియర్ కోడలు వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ చక్కదిద్దుగలుగుతుందో లేదో చూడాలి .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy