తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటి వరకు డైరెక్ట్ పాలిటిక్స్ జోలికి రాకుండా ఉండిపోయిన జేఏసీ నేత, ప్రొఫెసర్ కోదండ రాం ఇకపై క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా? తనకు ఎదురు ఎవరూ లేరు అని గట్టగా విశ్వసిస్తున్న సీఎం కేసీఆర్‌కు కంటిపై కనుకు లేకుండా చేయనున్నారా? అంటే ఔననే సమాధానమే వినబడుతోంది హైదరబాద్‌లో! తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎంతగా కష్టపడ్డారో.
అదేసమయంలో మేధావి వర్గాన్ని కదిలించడంలోను, శాంతి యుత పంధాలో పోరాటాన్ని ఉధ్రుతం చేయడంలోను కోదండరాం అంతే విజయం సాధించారు.
ఈ క్రమంలో కేసీఆర్‌పై ప్రజలకు ఎంత ఆదరణ, పొలిటికల్ మైలేజీ ఉందో.కోదండరాంకి కూడా మేధావిగా దాదాపు అంతే ఫాలోయింగ్ ఉంది.
ఇక, రాష్ట్ర సాధాన అనంతరం.కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో చేరకుండా కోదండ రాం దూరంగా ఉన్నారు.
దీనికి ఈ ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే కారణమని కొందరు అంటారు.ఏది ఏమైనా కోదండరాం మాత్రం ప్రభుత్వంలో చేరలేదు.
అయితే, ఇటీవల కాలంలో ఆయన స్వరం పెంచుతున్నారు.కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
మల్లన్నసాగర్ విషయంలో నేరుగా విరుచుకుపడ్డారు.ఇది ఒకింత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.
సాధారణంగా తెలంగాణలోని ఏ రాజకీయ నేత కేసీఆర్‌ను విమర్శించినా.ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు.
పొలిటికల్ క్లయిమేట్‌ను తనకు అనుకూలంగా కేసీఆర్ అలా మలుచుకున్నారు.అయితే, కోదండరాం విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రజలు విశ్వసించే ఛాన్స్ ఎక్కువ.
ఇప్పుడు ఈ కోణాన్నే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తోంది.వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలంటే కేసీఆర్‌కు దీటైన నేత అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ క్రమంలోనే కోదండరాం ఆ పార్టీకి తారసపడ్డారు.దీంతో ఆయనను రంగంలోకి దింపాలని తెరవెనుక వ్యూహం రెడీ అవుతోందని సమాచారం.
మరోపక్క, పొలిటికల్‌గా కేసీఆర్ తనను ఎదగకుండా చేశారని కోదండ రాంలో ఆవేదన ఉందని ఆయన సన్నిహితులు అంటారు.ఈ క్రమంలోనే ఆయన ప్రత్యామ్నాయ వేదికకోసం చూస్తున్నారని సమాచారం.
దీంతో అటు కాంగ్రెస్‌కి కోదండరాం అయాచితవరంగా మారడంతో ఈయనకు కూడా ఆపార్టీ పెద్ద దిక్కుగానే మారనుందట.ఒక వేళ తాను కాంగ్రెస్‌లోకి వెళ్లినా.
తెలంగాణ ప్రజలు తన వెంటే ఉండేలా కోదండ రాం తన ప్రసంగాలతో మెప్పించగలడు.పోరాటం చేసింది మనమే అయినా.
దేశ వ్యాప్తంగా ఎన్నో అడ్డంకులు వచ్చినా.ఎవరినీ లెక్కచేయకుండా తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పడంలో కోదండరాం సక్సెస్ అవుతారని నేతలు భావిస్తున్నారు.
ఇక, తాజాపరిణామాలను చూస్తే.తాము తమకంటూ ప్రత్యేకంగా ఓ పేపర్, వెబ్ చానెల్ పెట్టుకుంటున్నట్టు కోదండరాం స్వయంగా ప్రకటించారు.
అంటే.ఆయన గ్రౌండ్‌లెవిల్‌లో అన్నింటికీ ప్రిపేర్ అవుతున్నారనే విషయం స్పష్టమవుతోంది.
అటు పొలిటికల్ ఎంట్రీ.ఇటు మీడియా ఎస్టాబ్లిష్ మెంట్.
సో.కోదండ రాం వ్యూహం అర్ధమైపోతోంది!! కాబట్టి 2019లో తనకు ఎవరూ పోటీ ఉండరని భావిస్తున్న కేసీఆర్‌కు కొత్త మొగుడు ముస్తాబవుతున్నట్టే కదా!! ఏం జరుగుతుందో మరో ఏడాది తర్వాత స్పష్టం!! .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy