మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని కౌంటర్

సినిమాలపై కాకుండా ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్లు ఉన్నారంటూ విమర్శించారు.

అటువంటి వాళ్లు కూడా ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం గురించి మనకు ఎందుకని వాళ్లకు సలహా ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు.

డ్యాన్సులు, ఫైట్లు, యాక్షన్ గురించి మనం చూసుకుందామని చెప్పొచ్చు కదా అని సూచించారు.ఈ నేపథ్యంలో ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందన్నారు.

పవన్ రెండు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల ఓడిపోయాడని ఎద్దేవా చేశారు.

Advertisement
Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet