కిట్టు ఉన్నాడు జాగ్రత్త రివ్యూ

చిత్రం : కిట్టు ఉన్నాడు జాగ్రత్త బ్యానర్ : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ దర్శకత్వం : వంశీకృష్ణ నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర, అనీల్ సుంకర సంగీతం : అనూప్ రూబెన్స్ విడుదల తేది : మార్చి 3, 2017 మధ్యలో ఒకటి రెండు స్పీడ్ బ్రేకర్స్ తగిలాయి కాని, కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు రాజ్ తరుణ్ స్పీడ్ టాప్ గేర్ లోనే ఉంది.

ఇంత జోరు మీద ఉన్న రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాతో మరో మైలు దూరం దూసుకెళ్ళాడా లేక ఈ సినిమా అతని స్పీడ్ తగ్గించిందా చూద్దాం.

కథలోకి వెళితే : కిట్టు (రాజ్ తరుణ్) .ఇతనిది ఓ డిఫరెంట్ మాఫియా.మామూలుగా కిడ్నాపర్స్ ధనవంతుల పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తే, ఇతను మాత్రం ధనవంతుల కుక్క పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తుంటాడు.

ఇక హీరోయిన్ కనబడటం, ఆట పాటతో నడుస్తున్న సినిమాలోకి మరో ధనవంతుడు (అర్బాజ్ ఖాన్) వస్తాడు.ఇతనికో బాక్స్ కావాలి.దానికోసం కిట్టుతో డీల్ కుదుర్చుకుంటాడు.

కాని కొన్ని ఊహించని మలపుల వలన ఇటు అర్బాజ్ ఖాన్ కి, అటు పోలీసులకి టార్గెట్‌ గా మారతాడు కిట్టు.ఇంతకి ఆ బాక్స్ లో ఏముంది ? కిట్టు చిక్కుల్లో ఎలా పడ్డాడు, ఎలా తప్పించుకున్నాడో సినిమాలో చూడండి.నటీనటుల నటన : రాజ్ తరుణ్ ఎప్పటిలానే తన కామెడి టైమింగ్ తో కొన్ని నవ్వులు పూయిస్తాడు.మిగితా సినిమాలతో పోలిస్తే ఇందులో కొంచెం స్టయిలిష్ గా కూడా కనిపిస్తాడు.

Advertisement

అను ఎమ్మానుయేల్ ఎలాగో అందంగా ఉంటుంది.ఈ సినిమాలో కూడా అందంగా కనిపించింది.

మజ్నుతో పోలిస్తే, హావభావాల వ్యక్తికరణ కొంచెం మెరుగుపడినట్లే.అర్బాజ్ ఖాన్ లిప్ మూమెంట్ కి డబ్బింగ్ కి మ్యాచ్ అవని విలనీతో కొంచెం విసుగు తెప్పిస్తాడు.

ఇప్పటికే జై చిరంజీవ సినిమాలో విలన్ గా కనిపించి తుస్సుమనిపించిన అర్బాజ్, మరోసారి విఫలమయ్యాడు.కామెడి బ్యాచ్ లో ఎప్పటిలాగే పృథ్వీ కామెడి ఓ హైలెట్.

టెక్నికల్ టీమ్ : అనూప్ రూబెన్స్ పాటలు బాగాలేవు.నేఫథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
అక్కినేని కోడలిగా మొదటి సంక్రాంతి జరుపుకున్న ... భారీ ట్రోల్స్ కి గురైన నటి!

సినిమాటోగ్రాఫి బాగుంది.ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది.

Advertisement

విశ్లేషణ : ఈ సినిమా మొదట ఒక థ్రిల్లర్ లా తీద్దామని అనుకున్నట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.కాని అటు తిరిగి ఇటు తిరిగి రాజ్ తరుణ్ - అనిల్ సుంకర్ చేతిలో పడటంతో కామెడి కథగా మారింది.

అక్కడే తెలిసిపోతుంది .రాజ్ తరుణ్ నుంచి ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తారని.వారి కోరికకు తగ్గట్టుగా ఫస్టాఫ్ మంచి వినోదాన్ని అందించిన కిట్టు ఉన్నాడు జాగ్రత, సెకండాఫ్ లో కొద్దిగా స్లో అయిపోయి, సినిమాని యావరేజ్ ని చేసింది.

కాసిన్ని నవ్వుల కోసం, ఓసారి అలా టైమ్ పాస్ కి చూసే ఫ్లిక్ కెటాగిరిలోకి వెళ్ళిపోయింది ఈ సినిమా.ప్లస్ పాయింట్స్ : * ఆసక్తి కలిగించే కొన్ని పాయింట్స్ * రాజ్ తరుణ్, పృథ్వీ కామెడి * టైమ్ పాస్ ఫస్టాఫ్ మైనస్ పాయింట్స్ : * సంగీతం * సెకండాఫ్ లో ఎగుడుదిగుడు చివరగా : కిట్టుతో కొంచెం టైమ్ పాస్

తెలుగుస్టాప్ రేటింగ్ :2.75/5

తాజా వార్తలు