బీజేపీ సంచలన నిర్ణయం

సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తూనే ఉంది.

ఆ క్రమంలోనే ఢల్లీి ఎన్నికలు కూడా వచ్చాయి.

ఈ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని కమలనాధులు భావిస్తున్నారు.ఈ ఎన్నికలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికలపై జాతీయ మరియు లోకల్‌ మీడియా కూడా అతిత ఆసక్తిని చూపుతున్నాయి.ఈ నేపథ్యంలోన బీజేపీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఎలాగైనా ఢల్లీి గద్దెను ఎక్కాలనుకుంటున్న బీజేపీ ఇటీవలే పార్టీలో జాయిన్‌ అయిన కిరణ్‌ బేడీని ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది.ప్రస్తుతం బీజేపీ అగ్ర నేతలు ఈ విషయంపై చర్చిస్తున్నారు.

Advertisement

బీజేపీ సాంప్రదాయం ప్రకారం ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పార్లమెంటరీ బోర్డులో చర్చించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు.అయితే ఈసారి మాత్రం కిరణ్‌ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఢల్లీిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ బలంగానే ఉంది.ఆ పార్టీని ఏమాత్రం తక్కువ అంచనా వేసేందుకు లేదు.

అందుకే బీజేపీ తమ వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలు అన్నింటిని వాడేందుకు సిద్దం అవుతోంది.మరి బీజేపీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే ఒంట్లో కొవ్వు ఖేల్ ఖ‌తం!
Advertisement

తాజా వార్తలు