కొత్త బిజినెస్ ఆలోచనలో కిరాక్ ఆర్పీ... భారీగా ప్లాన్ చేస్తున్న కమెడియన్!

కిరాక్ ఆర్పీ( Kirak RP ) జబర్దస్త్ కమెడియన్( Jabardasth Comedian ) గా అందరికీ సుపరిచితమే జబర్దస్త్ కార్యక్రమంలో తన కామెడీ పంచ్ డైలాగుల ద్వారా అందరిని మెప్పించిన ఈయన   గత కొంతకాలంగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.

మల్లెమాల వారితో ఈయనకు భేదాభిప్రాయాలు రావడంతో ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమం మల్లెమాల వారి పై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం పట్ల ఈయన చేసిన వ్యాఖ్యలను అప్పట్లో ఇతర జబర్దస్త్ టీం పూర్తిగా ఖండించారు.ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు( Nellore Peddareddy Chepala Pulusu ) అంటూ రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు.

అయితే ఈయన పలు నగరాలలో బ్రాంచ్లను కూడా ప్రారంభించి బిజినెస్ లో కూడా సక్సెస్ అయ్యారు అయితే ఈ చేపల పులుసు విషయంలో ఆర్పీ ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.

చేపలు క్వాలిటీ లేవని ధరలు కూడా అధికంగా ఉన్నాయి అంటూ విమర్శలు రావడంతో ఈయన కూడా క్వాలిటీ బట్టి రేటు ఉంటుందని ఇష్టమైన వాళ్ళు కొనండి ఖర్చు అనుకునేవాళ్లు కొనకండి అంటూ సమాధానం ఇచ్చారు.ఇక ఇటీవల కాలంలో రాజకీయాల పరంగా ఈయన చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూటమికి మద్దతు తెలపడమే కాకుండా మాజీ మంత్రులు సీఎంపై కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

Advertisement

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరాక్ ఆర్పీ మరో కొత్త బిజినెస్ గురించి వెల్లడించారు.మణికొండలో దాదాపు రెండు కోట్ల ఖర్చు చేసి ఓ రెస్టారెంట్( Restaurant ) ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం రెస్టారెంట్ పనులు ప్రారంభం అయ్యాయని ఈ నెలాఖరికల్లా పూర్తి అవుతుందని కిరాక్ ఆర్పీ తెలిపారు.

చేపల పులుసు విషయంలో నేనే తప్పులు అయితే చేశానో అలాంటి తప్పులు ఇక్కడ పునరావృతం కాకుండా చాలా ప్లాన్ ప్రకారం ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్లు ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు