బతికున్న పాముని మింగిన కింగ్ కోబ్రా.. వీడియో వైరల్..!

జింకలను, ఆవులను, ఇంకా ఇతర జంతువులను పెద్ద పాములు అమాంతం ఒకేసారి మింగటం మనం ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటాం.

కానీ ఒక పాము మరొక పాముని బతికుండగానే మింగేయడం మీరు ఎప్పుడైనా చూశారా.

నిజానికి ఇలాంటివి జరగడం చాలా అరుదు.కెమెరాలకు చిక్కడం ఇంకా అరుదు.

అయితే తాజాగా ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రత్యక్షమయ్యింది.ఈ వీడియో లో ఒక పాము మరొక పాముని మింగింది.

ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.వైరల్ అవుతున్న వీడియో లో ఒక పెద్ద కింగ్ కోబ్రా తాచు పాము ఉన్న ఒక రంధ్రంలోకి తలపెట్టడం చూడొచ్చు.

Advertisement

అనంతరం అందులో ఉన్న తాచు పాముని కింగ్ కోబ్రా నోట కరుచుకుంది.తాచు పాము బతికుండగానే దానిని అమాంతం నోటిలోకి మింగుతూ గుండ్రంగా తిరుగుతూ కింగ్ కోబ్రా భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది.

తాచు పాము ని కరకరా నములుతూ గుటుక్కున మింగింది.ఈ వీడియోని స్నేక్ వరల్డ్ ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

దీనికి లక్ష వరకు వ్యూస్, మూడు వేల వరకు లైకులు వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో ఇది చాలా భయంకరంగా ఉంది అని కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి దృశ్యాలను తామెప్పుడూ చూడలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
ఫుడ్ పాయిజనింగ్..నివారణ చిట్కాలు

ప్రపంచంలో ఎక్కువగా కింగ్ స్నేక్స్, కింగ్ కోబ్రా, బ్లాక్ హెడ్డెడ్ కొండచిలువలు, ముసురానా, నీలిమందు పాములు ఇతర పాములను తింటాయి.మిగతా పాములు ఇతర పాములను తినవు.

Advertisement

అయితే వీటికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలకు చిక్కడం చాలా అరుదు.

తాజా వార్తలు