తమిళనాడు కోరుకుంటున్న కియా, మరి ఏపీ సంగతేంటి

ప్రస్తుతం ఏపీ లో ఉన్న కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోతుందా అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబందించి సోషల్ మీడియా లో పెద్ద ప్రచారమే జరుగుతుంది.

ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా ప్రారంభమయ్యాయని అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ చెబుతుంది.కియా మోటార్స్‌కు సంబంధించి ఆ పత్రిక ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

కియా ఏపీ నుంచి తరలిపోతోందని ప్రాథమికంగా చర్చ ప్రారంభమయ్యాయని, ప్లాంట్ ను ఏపీ నుంచి తమిళనాడుకు తరలించడానికి కియా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది.ఎందుకంటే ఏపీలో ఆ సంస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమిళనాడుకు ప్లాంట్‌ను తరలిస్తే లాజిస్టిక్ ఖర్చులు కూడా తగ్గుతాయని కియా భావిస్తోందట.

ప్లాంట్ తరలింపుపై ఇప్పటికిప్పుడే క్లారిటీ రాకపోయినా.కియా ఎంత త్వరగా ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లగలదో అర్ధమవుతోందంటోంది రాయిటర్స్.

Advertisement

అయితే ఈ ప్లాంట్ తరలింపు చర్చలు రహస్యంగా జరుగుతున్నాయని సమాచారం.తమిళనాడుకు చెందిన కీలక అధికారి కూడా దీన్ని ధృవీకరించినట్లు ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

కియా తన అనుబంధ సంస్థ అయిన హుందాయ్ ప్రతినిధులతో ఈ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఆ సంస్థకు తమిళనాడులో భారీ కార్ల ఉత్పాదన ప్లాంట్ ఉంది కాబట్టి.

వారి ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించిందని రాయిటర్స్ చెప్పుకొచ్చింది.అయితే దీనిపై హుందాయ్ కంపెనీ కానీ.

తమిళనాడు, ఏపీ సీఎంవోలు కూడా స్పందించడానికి నిరాకరించారని చెబుతోంది.

ఏపీ కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే 
Advertisement

తాజా వార్తలు