ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు పెడుతున్నానో అందరికీ తెలుసని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి స్పష్టం చేశారు.కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ ఏజెండానని పేర్కొన్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ప్రజాప్రతినిధులే గెలుస్తారని తెలిపారు.ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ దిట్టని విమర్శించారు.

సాధించిన తెలంగాణలో యువతకు మిగిలింది ఆత్మహత్యలేనని తెలిపారు.రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇంకా చేయలేదన్నారు.గిరిజన బంధు కూడా అమలులోకి రాలేదని మండిపడ్డారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు