కిక్కు దిగకముందే మరొకటి రెడీ చేస్తోన్న కేజీఎఫ్

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఇప్పటికే ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

గతంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.దీంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ 2 చిత్రం ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

KGF 2 Release Date Fix, KGF, KGF 2, Yash, Prashant Neel, KGF 2 Teaser-కిక�

అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ టీజర్ అందరి అంచనాలను మించి ఓ రేంజ్‌లో ఉండటంతో ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

ఇక ఈ టీజర్ మేనియాతో ఊగిపోతున్న ప్రేక్షకులకు కేజీఎఫ్ చిత్ర యూనిట్ మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.ఈ సినిమా రిలీజ్ ఎప్పుడుంటుందా అని అందరూ ఎదురుచూస్తుండగా, ఈ రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి వచ్చేసిందట.

Advertisement

జూలై 30కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే కేజీఎఫ్ అభిమానులకు పండగే అని చెప్పాలి.

ఇప్పుడే టీజర్ మేనియాలో మునిగిన ప్రేక్షకులకు అప్పుడే సినిమా రిలీజ్ విషయంపై వార్తలు వస్తుండటంతో వారికి డబుల్ ట్రీట్ ఇచ్చినట్లు అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.అయితే సినిమా రిలీజ్ విషయంలో ఇంకా చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.

ఇక తాజాగా రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్‌లో హీరో యష్‌ను ఓ రేంజ్‌లో చూపెట్టడంతో ప్రేక్షకులు ఈ టీజర్‌కు అడిక్ట్ అవుతున్నారు.ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తుండటంతో ఈ టీజర్ ట్రెండింగ్‌లో సాగుతోంది.

వేగములు ఎన్ని, అవి ఏవి?
Advertisement

తాజా వార్తలు